ప్రభాస్ అభిమానులారా ఊపిరి పీల్చుకోండి..ఆదిపురుషుడు వచ్చేసాడు!

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:55 PM

ప్రభాస్ అభిమానులారా ఊపిరి పీల్చుకోండి..ఆదిపురుషుడు వచ్చేసాడు!

ప్రభాస్, కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సన్నీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లుని ఎక్కుపెట్టిన పోస్ లో కనిపిస్తాడు. ప్రభాస్ యొక్క ఈ కొత్త అవతారాన్ని చూసి అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు షేర్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడుగా మరియు రావణుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఈ చిత్రం యొక్క టీజర్ ను అక్టోబర్ 2 న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని సరయు నది ఒడ్డున నిర్వహించనున్నారు.





Untitled Document
Advertisements