దేశ పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్న కేసీఆర్..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:56 PM

దేశ పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్న కేసీఆర్..

ఇప్పుడు తెలంగాణ అంతటా కేసీఆర్ కొత్త పార్టీ గురించే చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆయన.. దసరా పండుగ రోజున (అక్టోబర్ 5) జాతీయ రాజకీయ పార్టీ పేరును ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధమవుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 80 కోట్లు వెచ్చించి 12 సీట్ల ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ కోసం గురువారం ఆర్డరు ఇచ్చేందుకు కేసీఆర్ రాజకీయ పార్టీని ప్రారంభించిన రోజునే.కాని ప్రస్తుతం మన దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలను బహిర్గతం చేసేందుకు టిఆర్‌ఎస్ అధినేత దేశవ్యాప్త పర్యటన కోసం ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగించనున్నారు. పార్టీ ఫండ్‌ని ఉపయోగించకుండా 865 కోట్ల రూపాయల విరాళాలతో విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విమానాలను అద్దెకు తీసుకుంటున్నారు. కొత్త జాతీయ పార్టీని స్థాపించే నేప‌థ్యంలో సొంత విమానం కావాల‌ని టీఆర్ఎస్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది.





Untitled Document
Advertisements