వాఘా సరిహద్దులో కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ సందడి

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 01:37 PM

వాఘా సరిహద్దులో కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ సందడి

ప్రేక్షకులు ముద్దుగా బన్ని అని పిలుచుకునే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలసి పాకిస్థాన్ సరిహద్ధు వాఘా చెక్ పోస్ట్ వద్ద సందడి చేశారు. ఆయన తన భార్య స్నేహారెడ్డి పుట్టిన సందర్భంగా కుటుంబంతో కలిసి వినూత్నంగా సరిహద్దు జవాన్లతో గడిపారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కూడా ఉన్నారు. ప్రతి రోజు సాయంత్రం బీఎస్ఎఫ్ జవాన్లు చేసే కవాతులో అల్లు అర్జున్ గౌరవ అతిథిగా పాల్గొన్నాడు. సైనిక సిబ్బందితో కలసి ఫొటోలు తీసుకున్నాడు.
ఈ నెల 29న స్నేహారెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆ పుట్టిన రోజున మొదట పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించిన అల్లు అర్జున్ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత.. వాఘా సరిహద్దుకు కుటుంబంతో కలిసి వెళ్లి అక్కడ జవానులతో కలిసి సరదాగా సందడి చేసారు. ఆ సందర్భంలో తీసుకున్న ఫొటోలను అల్లు అర్జున్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేశాడు.





Untitled Document
Advertisements