పీఎఫ్‌ఐ నిషేధంపై ఆసక్తికర కమెంట్లతో ఎంఐఎం పార్టీ అధినేత..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 02:07 PM

పీఎఫ్‌ఐ నిషేధంపై ఆసక్తికర కమెంట్లతో ఎంఐఎం పార్టీ అధినేత..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎఫ్ఐ కేసులో చివరికి.. ఆసంస్థపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వ నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత..
ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అయితే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా నిషేధంపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆ సంస్థకు తన మద్దతు ఏనాడూ ఉండబోదన్న ఆయన.. ఈ నిషేధం సమర్థించదగింది కాదంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా పీఎఫ్‌ఐ విధానాలను మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తూ.. విధానాన్ని సమర్ధిస్తూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పీఎఫ్‌ఐపై విధించిన నిషేధాన్ని మాత్రం సమర్థించబోను అని ఆయన పేర్కొన్నారు.
కానీ, ఖాజా అజ్మేరీ బాంబు పేలుళ్ల దోషులతో సంబంధం ఉన్న సంస్థలు ఎందుకు నిషేధించబడలేదు అంటూ ఈ కేంద్ర ప్రభుత్వం మితవాద మెజారిటీ సంస్థలను ఎందుకు నిషేధించడం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాకుండా యూఏపీఏ సవరణను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలపై ఆయన దాడి చేశారు. యూఏపీఏకు కాంగ్రెస్‌ సవరణ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం దానిని మరింత క్రూరంగా మార్చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ దానికి మద్దతు తెలిపింది అని విమర్శించారు. ఈ రకమైన కఠినమైన నిషేధం ప్రమాదకరమన్న ఆయన ఇది తన అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం అని పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశపు క్రూరమైన నల్ల చట్టం యుఏపీఏ కింద ఇప్పుడు ప్రతి ముస్లిం యువకుడిని పీఎఫ్‌ఐ కరపత్రంతో అరెస్టు చేస్తారని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements