ఇలాంటి లక్షణాలు ఉంటె కాలేయం అనారోగ్యానికి గురి అయినట్టే..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 02:09 PM

ఇలాంటి లక్షణాలు ఉంటె కాలేయం అనారోగ్యానికి గురి అయినట్టే..

మానవ శరీరం కదలికలో కాలేయం పనితీరు చాలా ముఖ్యమైనది. మన శరీరంలో, తిరిగి పెరిగే ఏకైక అవయవం కాలేయం. కాలేయం మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లను, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో లభించే విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండకపోతే ఆ ఎఫెక్ట్ మిగతా భాగాలపై పడుతుంది. కాబట్టి ముందు నుంచి లివర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య తప్పవు. లివర్‌కి సమస్య వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందు నుంచి గమనించాలి. మరి అలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
​జీర్ణ సమస్యలు : లివర్ సమస్యలు ఉన్నప్పుడు జీర్ణ క్రియలు సరిగ్గా ఉండవని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ తగ్గుతుందని దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏం తిన్నా అరగకపోవడం, ఆకలి లేకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఇలా రెగ్యులర్‌గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆలోచించాలి.
​డిప్రెషన్ : లివర్ సమస్యలు వస్తే ఆ ఎఫెక్ట్ మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలకి లివర్ సమస్యలు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటన్నింటిని జాగ్రత్తగా గమనించాలి. ఎక్కువ కాలంగా డిప్రెషన్‌గా అనిపిస్తే మానసిక నిపుణులని కన్సల్ట్ అవ్వడం మంచిది.
​క్రోనిక్ తలనొప్పి : లివర్ సమస్యలు ఉంటే గనుక రెగ్యులర్‌గా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. లివర్ ఏదైనా సమస్యగా ఉన్నప్పుడు పదే పదే తలనొప్పి వస్తుందని, కాబట్టి లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం వహించొద్దని నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారి తలనొప్పి వస్తుంటే కచ్చితంగా డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలని వారి నిపుణులు సూచిస్తున్నారు. సరిగ్గా నీరు తాగకపోయినా, నిద్ర లేకపోయినా, ఒత్తిడిగా ఉన్నా కూడా తలనొప్పి వస్తుంటుంది. అయితే ఇవన్నీ పాటించినా తలనొప్పి వస్తుందంటే ఆలోచించాల్సిందే.
​మలబద్దకం : జీర్ణ శక్తి తక్కువగా ఉండడం వల్ల లివర్ సమస్యలు ఉన్నప్పుడు మలబద్ధకం ఉంటుందని, ఆ సమస్యలతో బాధపడేవారికి బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీంతో టాయిలెట్ వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ లక్షణాన్ని కూడా కచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దు. అయితే సరైన ఫుడ్ తినకపోయినా, నీరు ఎక్కువగా తాగకపోయినా ఈ సమస్య ఉంటుందని గుర్తించాలి.
మొటిమలు : కొంతమందికి మొటిమలు కూడా ఉంటాయి. హార్మోన్లు పెరగడం వల్ల సెబమ్ అధికంగా ఏర్పడుతుంది. దీంతో స్కిన్ పోర్స్, యాక్నె వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ మొటిమలు ఎక్కువగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయొద్దొని నిపుణులు చెబుతున్నారు.
​అలసట : సెంట్రల్ న్యూరోట్రాన్స్మిషన్ మార్పుల కారణంగా అలసట ఏర్పడుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారిలో కచ్చితంగా అలసట ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏ పని చేయాలనిపించదు. నీరసంగా అనిపిస్తుంది. ఒక వేళ పని చేసినా త్వరగానే నీరసంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నడవలేరు, తినలేరు, ఏ పని చేయలేరు. ఈ విషయాన్ని కూడా కచ్చితంగా ఆలోచించండి.






Untitled Document
Advertisements