దీపావళి ధమాకాగా ‘సర్దార్’ డిఫరెంట్ గెట‌ప్స్‌లో కార్తి

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 02:14 PM

దీపావళి ధమాకాగా ‘సర్దార్’ డిఫరెంట్ గెట‌ప్స్‌లో కార్తి

కోలీవుడ్ హీరో కార్తి ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నా చిత్రం 'సర్దార్' . అభిమ‌న్యుడు ఫేమ్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. స్పై అయ్యుండి కూడా ఇండియ‌న్ ఇంటెలిజెన్స్‌ను భ‌య‌పెట్టేలా త‌న పాత్ర ఉందంటే పాత్ర‌లోని డెప్త్‌లో స్టోరిలో ట్విస్టులు, ట‌ర్నులను అర్థం చేసుకోవ‌చ్చు. త‌ను ఆరు గెట‌ప్స్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ గెట‌ప్స్ వెనుకున్న మ‌త‌ల‌బేంటి దేశం కోసం స‌ర్దార్‌గా కార్తి ఏం చేశారో తెలుసుకోవాలంటే దీపావ‌ళి వ‌ర‌కు ఆగాల్సిందే.
తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌ర్దార్ సినిమా దీపావ‌ళికి సంద‌డి చేయ‌నుంది. కాగా శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్ నిర్మించ‌గా, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున అక్కినేని మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి జి.వి.ప్ర‌కాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ర‌జీషా విజ‌య‌న్‌, చుంకీ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే విరుమాన్ అనే త‌మిళ చిత్రంతో సంద‌డి చేసిన కార్తి ఇప్పుడు పొన్నియిన్ సెల్వ‌న్ లో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అతి త‌క్కువ గ్యాప్‌లోనే స‌ర్దార్ సినిమాతో ఆయ‌న సంద‌డి చేయ‌బోతున్నారు.





Untitled Document
Advertisements