ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు మార్కెట్.. స్పెషల్‌ ఏంటంటే

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 02:47 PM

ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు మార్కెట్.. స్పెషల్‌ ఏంటంటే

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నగరంలోనూ వ్యాపార కేంద్రాలుంటాయి. భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఒక ప్రాంతంలో ఉంటే పేద మధ్య తరగతి కోసం కొన్ని ల్యాండ్ మార్క్ వంటి ప్రాంతాలుంటాయి. అందులో ఈ మార్కెట్ కి చాల డిమాండ్ ఉంది.
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ చూడాల్సిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. నగరంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందాలు కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. కేవలం సముద్ర తీరమే కాదు పార్కులు, ఆలయాలు, వినోద క్షేత్రాలు మరి ఇంకా ఎన్నో ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి విశాఖపట్నంలో తమిళనాడు మార్కెట్ కూడా ఉంది. అవును మీరు చదివింది నిజమే విశాఖ మహానగరంలో తమిళనాడు మార్కెట్‌ ఉందని మీకు తెలుసా. అస్సలు ఉండటమే కాదు ఆ మార్కెట్‌ అక్కడ చాలా ఫేమస్ ముఖ్యంగా పండుగ వచ్చిందంటే విశాఖ నగరవాసులంతా అక్కడ వాలిపోతారు..
ఎన్నో ఏళ్ల నుండి పెందుర్తి లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తమిళనాడు ప్రజలు. ఇక్కడ పేద, మధ్య తరగతి వారు కొనుక్కునేందుకు కావల్సిన వస్తువులన్ని అందుబాటు ధరలో దొరుకుతాయి. తమిళ వ్యాపారులు వివిధ రాష్ట్రాల నుండి బట్టలు తీసుకువచ్చి తక్కువ ధరకే అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అమ్మకాలు చేస్తూ ఉంటారు.
సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీళ్లు తమ సొంత రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్తారు. మిగతా సమయం అంతా కూడా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటారు. సంవత్సరం అంతా కొద్దిపాటి లాభాలు ఉన్నప్పటికీ ప్రత్యేక పండగ రోజులైన దసరా, సంక్రాంతి సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అంటున్నారు నిర్వాహకులు.





Untitled Document
Advertisements