ఇంట్లోనే అదిరిపోయే మటన్ బిర్యానీ తాయారీ ఇలా..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 03:35 PM

ఇంట్లోనే అదిరిపోయే మటన్ బిర్యానీ తాయారీ ఇలా..

మాంసాహారుల్లో మటన్ నచ్చని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా మటన్ బిర్యాని అంటే పడి చచ్చిపోతారు. భారత్‌లో వివిధ స్టైల్స్‌లో మటన్ బిర్యానీని తయారు చేస్తారు. ప్రతి బిర్యానీకి ఓ ప్రత్యేకత ఉంది. వీటిలో తమిళనాడు స్టైల్ మటన్ బిర్యానీ ఫేమస్. సీరాగ సాంబా రైస్‌తో చేసే ఈ ధమ్ బిర్యానీ మంచి రుచిని అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ధమ్‌గా వండే ఈ బిర్యానీని కుండలో వండుతారు. ఆవిరి బయటకు రాకుండా గోధుమ పిండి లేదా అల్యూమినియం రేకుని పెట్టి చేస్తారు. మరి ఈ బిర్యానీ తయారీ, పూర్తి రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క- 1 అంగుళంది, లవంగాలు- 6, యాలకులు- 3, సోంపు- 1/2 టీస్పూన్, జాపత్రి- 2, జీర- 1/2 టీస్పూన్, మటన్ మసాలా, మటన్- 500 గ్రాములు, వేరుశనగ నూనె- 5 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్, నెయ్యి- 5 టేబుల్ స్పూన్లు, బే ఆకు- 2, షాలోట్స్- 15, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్- 1 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి- 3, నిమ్మరసం- 2 స్పూన్లు, కారంపొడి- 2 స్పూన్లు, కొత్తిమీర పొడి- 3 స్పూన్లు, పుదీనా ఆకులు- ఒక కప్పు, కొత్తిమీర ఆకులు- కప్పు, పెరుగు- కప్పు, సీరాగా సాంబా రైస్- 500 గ్రాములు రెండు కప్పులు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: ముందుగా బిర్యాని మసాలా కోసం సుగంధ ద్రవ్యాలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. తర్వాత సీరాగా సాంబా రైస్‌ను 30 నిమిషాల పాటు నానబెట్టాలి. బిర్యానీ కుండలో వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, బే ఆకు, షాలోట్లు, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, నిమ్మరసం, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, వేసి పచ్చి వాసన పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఇదే క్రమంలో నెయ్యి, సిద్ధం చేసిన బిర్యానీ మసాలా, కారంపొడి, కొత్తిమీర, సిద్ధం చేసిన మటన్ మసాలా పేస్ట్ వేసి కొద్ది నిమిషాలు పాటు ఉడికించాలి.
కుండలో ఈ మిశ్రమానికి పెరుగు, ఉప్పు, పుదీనా ఆకులు కొత్తిమీర జోడించి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మటన్ ముక్కలు వేసి 2 కప్పుల నీరు పోసి 20 నిమిషాల పాటు వేడి చేయాలి. మటన్ ఉడికే సమయానికి గ్రేవీ మందంగా మారుతుంది. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత నానబెట్టిన బియ్యంతో పాటు 6 కప్పుల నీటిని కలపాలి (సీరాగా సాంబా రైస్‌కు రెండు రెట్లు నీరు పోయాలి). బియ్యం ద్వారా ఎక్కువ నీరు పీల్చుకునే వరకు ఆవిరి బయటకు రాకుండా కుండను గోధుమ పిండితో మూసివేయాలి. మూసివేసిన కుండను 15 నిమిషాల పాటు అణచిపెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపాలి. తర్వాత 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు పాన్ తెరచి బియ్యాన్ని మెత్తగా చేసి రైతాతో వేడిగా వడ్డించండి.





Untitled Document
Advertisements