సక్సెస్ స్టోరీతో నిలిచిన ఐఎఫ్ఎస్ అధికారి..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 03:36 PM

సక్సెస్ స్టోరీతో నిలిచిన ఐఎఫ్ఎస్ అధికారి..

ఆసక్తి, పట్టుదల ఉంటే చాలు ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు అని ఎంతోమంది ప్రముఖులు నిరోపించారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగి తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారు. కలలను సాకారం చేసుకునే ప్రయాణంలో ఎదురైన అవమానాలను జీవిత పాఠాలుగా భావించి ముందడుగు వేశారు. ఇదే కేటగిరీకి చెందుతారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్‌ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అయన ఒకప్పుడు ఇంగ్లీష్‌ అంటే భయపడి అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కష్టపడితే అనుకున్నది సాధించగలడని మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించాడు కూడా. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్న పర్వీన్.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో ఎక్కువ కటాఫ్ ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిగా, ఒక సెలబ్రిటీ ఆఫీసర్‌గా మారారు. ఆయన సక్సెస్ స్టోరీ..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్‌, రాజస్థాన్ హనుమాన్‌గర్ జిల్లా మిర్జావాలి మీర్ గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లికి 13 ఏళ్లకే పెళ్లి జరిగింది. 16 ఏళ్లకే పర్వీన్ పుట్టాడు. మధ్యతరగతి కుటుంబం కావడంతో, అతడిని చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు.
చిన్న నాటి నుంచి హిందీ భాషలో చదువుకున్న పర్వీన్ కస్వాన్‌ కాలేజీ చదువుల్లో భాష విషయంలో ఇబ్బందులు పడ్డారు. కాలేజీలో ఎక్కువ మంది ఇంగ్లీష్‌‌లోనే మాట్లాడేవారని, తనకు అసలు అర్థమయ్యేది కాదని, ఆ తర్వాత ఇంగ్లీష్‌‌లో పట్టు సాధించగలిగానని పర్వీన్ ఇంటర్వూల్లో తెలిపారు. అతను ఏరోస్పేస్‌పై ఆసక్తితో అందులో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ తీసుకున్న పర్వీన్.. గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి బెంగళూరు ఐఐఎస్‌సీలో మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ డిజైన్ చేశారు. ఆ తర్వాత 2015లో యూపీఎస్‌సీ ఎగ్జామ్‌ రాసి 81వ ర్యాంకు సాధించారు. అంతే కాకుండా మిగతా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులతో పోలిస్తే ఐఎఫ్ఎస్ కు ఎక్కువ కటాఫ్ ఉంటుంది. అయినా ఆ కటాఫ్ క్లియర్ చేసి పర్వీన్ కస్వాన్‌ ఐఎఫ్ఎస్ అధికారి అయ్యారు. అయితే, అందుకు పర్వీన్ చాలా కష్టపడ్డారు. ఐఎఫ్ఎస్ అధికారి అయ్యాక ఆయన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఇంగ్లీష్‌ రాక ఇబ్బందులు పడ్డ ఆయన ఇప్పుడు ఇంగ్లీష్‌ భాషలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పర్వీన్ చేసే ప్రతి పోస్టు కోసం నెటిజన్లు, ఆయన ఫాలోవర్స్ వెయిట్ చేస్తుంటారు. అడవులు, జంతువులకు సంబంధించిన ఫొటోలను పర్వీన్ పోస్టు చేస్తుంటారు. దీంతో ఆయన ఫొటోగ్రఫీ స్కిల్స్‌ను మెచ్చుకుంటూ రకరకాల కామెంట్స్ చేస్తుంటారు పాలోవర్స్. ఆయనకు ఇన్‌స్టా‌గ్రామ్ లో 40,000 మంది, ట్విట్టర్‌లో 4,13,000 మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.
తన లక్ష్యం అయిన ఐఎఫ్ఎస్ సాధించడం కోసం చాలా కష్టపడినట్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు పర్వీన్. ఎన్సిఇఆర్టి బుక్స్‌తో పాటు న్యూస్ పేపర్స్ చదివానని, మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేశానని వివరించారు. ఫలితంగా ఫస్ట్ అటెమ్ట్‌లోనే సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. ఐఎఫ్‌ఎస్ అయిన తర్వాత 2016-2018 మధ్య కాలంలో డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెస్ట్రీలో మరో మాస్టర్స్ చేశారు పర్వీన్.





Untitled Document
Advertisements