వైద్య, ఆరోగ్య రంగానికి ఎన్టీఆర్ స్ఫూర్తి .. అశోక్ గజపతి రాజు

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 03:58 PM

వైద్య, ఆరోగ్య రంగానికి ఎన్టీఆర్ స్ఫూర్తి .. అశోక్ గజపతి రాజు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతలు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట్లాడారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని, వైద్యపరంగా ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు
టీడీపీపై ఎదురుదాడిగా వర్సిటీ పేరు మార్చారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కాగా, కృష్ణా జిల్లా గుడివాడలో నేటి నుంచి టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు కొనకళ్ల, రావి వెంకటేశ్వరరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. పలనాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.





Untitled Document
Advertisements