గుజరాత్‌లో అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ప్రధాని మోదీ కాన్వాయ్

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 04:28 PM

గుజరాత్‌లో అంబులెన్స్‌కు దారి ఇచ్చిన  ప్రధాని మోదీ కాన్వాయ్

అంబులెన్స్‌కు దారి వదలడానికి ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ గుజరాత్‌లోని ప్రధాన రహదారిపై ఆగింది. ప్రధాని మోదీ, అధికారులు శుక్రవారం అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భాగమైన నల్లరంగు వాహనం రోడ్డుకు ఎడమవైపునకు వెళ్లడం. అహ్మదాబాద్-గాంధీనగర్ రహదారిపై అంబులెన్స్‌కు దారి ఇస్తూ ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భాగమైన నల్లరంగు వాహనం రోడ్డుకు ఎడమవైపునకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రధాన రహదారి పక్కనే ప్రధాని కాన్వాయ్‌ను నిలిపి ఉంచగా, పరిసరాలను గమనించేందుకు భద్రతా సిబ్బంది వాహనం బయట నిలుచున్నారు. ఈ వీడియో చుసిన నెటిజెన్ లు ప్రధాని మోడిని ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/i/status/1575785028235059201





Untitled Document
Advertisements