టేస్టీ స్నాక్ చిల్లీ బ్రెడ్

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 04:49 PM

టేస్టీ స్నాక్ చిల్లీ బ్రెడ్

కావలసిన పదార్ధాలు ; బ్రెడ్ - 4 ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ - 1 టేబుల్ స్పూన్, నూనె - 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు - 1/2 కప్పు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 1/4 కప్పు (సన్నగా తరిగినవి), మిరపకాయ పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ (వేడి నీటిలో 2-3 పచ్చిమిర్చి నానబెట్టి, నీళ్లు పోసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి), టొమాటో సాస్ - 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ - 1/2 టి స్పూన్, వెనిగర్ లేదా నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, నీరు - 1/4 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారి విధానం : ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకుని చిన్న చిన్న చతురస్రాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓవెన్‌లో ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి అందులో 1 టేబుల్‌స్పూను నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి విడిగా ప్లేట్‌లో పెట్టుకోవాలి. తర్వాత అదే ఫ్రైయింగ్ పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయముక్కలు, వెజ్స్ వేసి కొద్దిగా ఉప్పు చల్లి బాగా వేయించాలి. తర్వాత అందులో సోయాసాస్, టొమాటో సాస్, చిల్లీ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి 2 నిమిషాలు మరిగించాలి. తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి బాగా గిలకొట్టి పైన స్ప్రింగ్ ఆనియన్ చిలకరిస్తే రుచికరమైన చిల్లీ బ్రెడ్ రెడీ.





Untitled Document
Advertisements