వెన్ను మరియు మోకాలి నొప్పులకు నేరేడు పళ్ళతో చెక్..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 05:07 PM

వెన్ను మరియు మోకాలి నొప్పులకు నేరేడు పళ్ళతో చెక్..

నేరేడు ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు. సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.
మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.
పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.
నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.
దీర్ఘకాల వ్యాదులకు నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.
వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements