మధ్య తరగతి కుటుంబం నుంచి మోడల్ గా మారిన యువతి.. సక్సెస్ స్టోరీ

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 05:42 PM

మధ్య తరగతి కుటుంబం నుంచి మోడల్ గా మారిన యువతి.. సక్సెస్ స్టోరీ

ఫ్యాషన్ వరల్డ్ అంటేనే రంగుల ప్రపంచం.. మోడలింగ్ చేయాలన్న ఆలోచన చాలామంది యువతుల్లో ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యం అవుతుంది. ఆశయంతో పాటు కుటుంబ పెద్దల సహకారం ఎంతో అవసరం. అదే ఓ సాధారణ యువతి ఫ్యాషన్ వరల్డ్ కు రావాలన్న కష్టమే. కానీ ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో నుంచి ఫ్యాషన్.. సినీ రంగంలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తోంది ఓ యువతీ.. ఇంటర్ చదువుతున్నా తల్లి ఆశయం.. ఆమె చిరకాల కోరిక కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ఫ్యాషన్ అంటేనే తెలియని వయస్సు నుంచి.. ఎలాగైనా సినిమాల్లో నటించాలని ఆశయంతో ముందుకెళుతోంది. వెండి తెరపై తనను,, తన అమ్మ చూడాలనే దృక్పధంతో ముందుకెళ్తూ.. ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న సిటీ., స్టేట్ పోటీలలో విజేతగా నిలుస్తూ.. పేదరికం విజయానికి అడ్డు కాదని నిరూపించింది.
యువతీ యువకుల కళల రంగులమయంగా ఉంటుంది సినీ.. ఫ్యాషనింగ్ రంగాలు. ఈ రంగాల్లో నిలదొక్కుకోవాలంటే ట్యాలెంట్ తో పాటుగా అదృష్టం ఉండాలి.. లేదా వెనుక తెలిసిన బలమైన వ్యక్తుల సపోర్ట్ పెరుగుతుంది. ఈ రెండు లేకుంటే అంతే రంగుల ప్రపంచంలో రాణించడం కష్టమే.
రంగుల లోకంలో చిన్న చిన్న కలర్ చుక్కలుగా మారిపోక తప్పదు. కానీ తిరుపతికి చెందిన ఐశ్వరి రెడ్డి మోడలింగ్ రంగంలో తనదైన ప్రతిభ చూపి వెండి తెరపై ఓ వెలుగు వెలగాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తోంది. చిన్ననాటి నుంచి నాన్న ఇంటి వారి నుంచి సహకారం లేదు. ఆడపిల్ల పుట్టిందని నాన్నతో సహా నాన్నమ్మ., తాతయ్యలు దూరంగా ఉంటున్నారు. అయితే తల్లి గౌరీ ప్రియాంకె నాన్నఅయ్యి దారి చూపుతూ అమ్మగా లాలిస్తూ పెంచింది. చిన్న నాటి నుంచి అమ్మ కళలను తన కలలుగా భావించిన ఐశ్వరి రెడ్డి అమ్మ ఇష్ట-అయిష్టాల గురించి ఆరా తీసేది. ఇద్దరి సంభాషణ నడుమ మోడలింగ్ అనే సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ సాగింది. అదే తరుణంలో తల్లి గౌరీ ప్రియాంక తనకు 'చిన్ననాటి నుంచి మోడలింగ్.. సినీ పరిశ్రమ అంటే ఇష్టం.. కానీ ఇంట్లోని పెద్దల నిరాకరణ వాళ్ళ సినీ ఇండ్రస్ట్రీలోకి వెళ్లలేక పోయానని' చెప్పుకొచ్చింది. దీంతో అమ్మకు ఇష్టమైన ప్రపంచం తన ఇష్టంగా మారింది. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు ప్రారంభించినంది. ఫర్ ఎవర్ స్టార్ ఇండియా సిటీ స్థాయి పోటీల్లో పొల్గొంది. అందులో వేల సంఖ్యలో టీనేజర్స్ పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఐశ్వరి రెడ్డి ప్రథమ స్థానం సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీ జైపూర్ లో జరిగిన మిస్ టీన్ ఇండియా (స్టేట్ వైడ్) అవార్డు లో మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్ గా ఎంపీక అయింది ఐశ్వరి.
చిన్నప్పుడు ఎన్నో కళలు కన్నాను.. కానీ అవేవి సాకారం కాలేదు. కానీ నా లాగా నా కుమార్తె మిగిలిపోకూడదనే ఆలోచించాను. నా విషయంలో మా పెద్దలు చేసిన తప్పు నేను చేయకూడదని నిశ్చయించుకున్న.. తాను కష్టపడినా తన కూతురు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్న. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడిప్పుడే మోడలింగ్ ప్రపంచంలో నా కూతురు అడుగులు వేస్తోంది. తాను వేసే అడుగులు బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటానని' న్యూస్18 తో ఐశ్వరి రెడ్డి తల్లి గౌరీ ప్రియాంక చెప్పారు.
ఫిట్ గా ఉండటానికి యోగ.. డైట్ నిత్యం ఫాలో అవుతుంటారు. చదువుతో పాటు మోడలింగ్ పోటీలకు అధికంగా పాల్గొంటాను. మా అమ్మ సినిమా రంగంలో వెళ్లాలని అనుకుంది. కానీ కొన్ని ఘటనల వల్ల వివాహం చేసుకుంది. మా అమ్మ కోరిక తన కోరికగా భావించి వెండి తెరపై కనిపించి అమ్మ ఆశయాన్ని నిలబెడుతా అంటుంది ఐశ్వరి.





Untitled Document
Advertisements