పండుగ సందర్బంగా ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గుదల..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 10:42 AM

పండుగ సందర్బంగా ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గుదల..

దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి. అక్టోబరు 1 అనగా నేటి నుండి అమల్లోకి ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.25.50 తగ్గింది. కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లోని 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.25.50, కోల్‌కతాలో రూ.36.50, ముంబైలో రూ.35.50, హైదరాబాద్‌లో 36.5 తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది. అయితే వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇది వరుసగా ఆరోసారి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.2354కి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబరు 1న 91.50 రూపాయలు తగ్గించగా.. ఈ నెలలో మాత్రం 25.50 మేర దిగొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు రూ.1885గా ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ.1859.50కి తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో 1995.50 నుంచి 1959.50కి తగ్గింది, ముంబైలో 1844 నుంచి 1811, చెన్నైలో రూ.2045 నుంచి 2009కి ధరలు తగ్గాయి.
హైదరాబాద్‌లో రూ.36.50 రూపాయలు తగ్గడంతో.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5 నుంచి రూ.2063కి తగ్గింది. వరంగల్‌లో రూ.2102గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో రూ.2035.5, విశాఖపట్టణంలో రూ.1908.5కి చేరింది. కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో మాత్రం ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరగా జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత మళ్లీ పెరగలేదు, తగ్గలేదు.
హైదరాబాద్‌లో 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1105 వద్ద స్థిరంగా ఉంది. వరంగల్‌లో రూ.1124గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1076.50గా ఉంటే.. విశాఖపట్టణంలో రూ.1068.5 వద్ద స్థిరంగా ఉంది. మరియు ఢిల్లీలో కుడా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ 1053 రూపాయలకు లభిస్తోంది. ముంబైలో 1052.50, చెన్నైలో 1068.50 వద్ద స్థిరంగా ఉంది. కోల్‌కతాలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1079కి అందుబాటులో ఉంది.





Untitled Document
Advertisements