నూతన మార్పులతో నేడు 5జీ సేవలు ప్రారంభం..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:09 AM

నూతన మార్పులతో నేడు 5జీ సేవలు ప్రారంభం..

భారతదేశంలో నేటి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించనున్న ప్రగతి మైదాన్ లో నిర్వహించనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. అయితే దేశంలో 5జీ సేవల రాకతో మరో కొత్త సాంకేతిక విప్లవం మొదలు కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 5జీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. కాగా చిన్నవ్యాపారాలకు ఇది ప్రయోజనంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇంటర్ నెట్ స్పీడ్ జియో రాకతో పది రెట్లు పెరగనుంది. దీంతో తక్కువ సామర్థ్యం ఉన్న పరికరాలతో ఎక్కువ సేవలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పరికరాలకు పెద్దగా కంప్యూటింగ్ అవసరం ఉండదని వివరిస్తున్నారు.
అయితే సేల్స్ పీపుల్స్ కు ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన ఇంటర్ నెట్ కనెక్షన్ 5జీ ద్వారా సాధ్యపడుతుంది. తద్వారా వారి సేల్స్ సామర్థ్యం పెరుగుతుంది. వారు కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయగలుగుతారు. కస్టమర్లకు మంచి అనుభవం అందించడానికి వారు ఆగ్మెంటెడ్ లేదా వర్చువల్ రియాలిటీని ఉపయోగించగలుగుతారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులకు మెరుగైన శిక్షణను అందించే అవకాశం కలుగుతుంది.
సాంకేతిక నిపుణులు కొత్త, విభిన్న పరికరాలపై పని చేయాల్సి వచ్చినప్పుడు కంటెక్ట్సవల్ డయాగ్రామ్స్ తో పాటు బయటి నుంచి సహాయాన్ని పొందొచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అప్లికేషన్ అందించే లైవ్ ఫీడ్‌ ద్వారా ఇది సాధ్యపడుతుంది. 4 జీ తో పోల్చితే 5జీ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐడియల్లేబొరేటరీ కండిషన్ల వద్ద 4 జీ నెట్వరక్ 1 గిగాబైట్స్ పర్ సెకండ్ గరిష్ట స్పీడ్ ను నమోదు చేస్తుంది. అదే లేబరోటరి కండిషన్ల వద్ద 5జీ నెట్వర్క్ 20 గిగాబైట్స్ పర్ సెకండ్స్ ఇంటర్ నెట్ స్పీడ్ ను నమోదు చేస్తుంది. ఈ స్పీడ్ కారణంగా.. ఎలాంటి వీడియో అయినా.. సెకండ్స్ లో డౌన్ లోడ్ చేయవచ్చు. దీంతో కస్టమర్లకు కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను చాలా సులువుగా వివరించవచ్చు.
5 జీ నెట్‌వర్క్ వైద్య రంగంలో అధునాతన వైద్య విధానాలను మారుమూల ప్రాంతాలకు విస్తరించడంలో సహాయపడుతుంది. దేశంలో ప్రస్తుతం వైద్యుల కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు 5జీ పరిష్కారం చూపనుంది.5జీ రాకతో వైద్యులు వారు ఉన్న చోటు నుంచే రోగులతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అలాగే వైద్యులు రిమోట్ సర్జరీ చేయడానికి సర్జన్లను కూడా ఎనేబుల్ చేస్తారు.
5 జీ యొక్క కొత్త టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది. అధునాతన 5 జీ రూటర్‌తో, ఇంటిలోని స్మార్ట్ పరికరాలు, ఇతర పరికరాల నెట్‌వర్క్ బాగా బలోపేతం అవుతుంది. రిమోట్ మానిటరింగ్, స్మార్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు టెలిహెల్త్ వంటి రంగాల బలోపేతానికి 5జీ ఉపయోగపడనుంది. అదే సమయంలో, స్మార్ట్ ఆర్ఎఫ్ఐడి సెన్సార్ మరియు జీపీఎస్ సహాయంతో రైతులు జంతువులను కూడా ట్రాక్ చేయవచ్చు.
5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు మెరుగైన కాల్స్ మరియు కనెక్టివిటీ సదుపాయాన్ని పొందుతారు. ఇంటర్నెట్ వినియోగదారులు చిటికెలో సినిమాలు మరియు ఇతర విషయాలను డౌన్‌లోడ్ చేసుకోగలరు. టీవీ ప్రోగ్రామ్ లు, మల్టీమీడియా మొదలైనవాటిని అధిక నాణ్యతతో పాటుగా వేగంగా చూడగలుగుతారు. దీంతో వ్యవసాయం, విద్య , ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్‌ నిర్వహణ తదితర అన్ని రంగాల్లో విప్లవం వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు డ్రైవర్‌ లెస్‌ కారు కల కూడా 5జీ టెక్నాలజీతో సాకారం కాబోతుందని నిపుణులు చెబుతున్నారు. 5G టెక్నాలజీ ఆరోగ్య సంరక్షణ, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ గేమింగ్ కోసం కొత్త మార్గాలను అందించనుంది





Untitled Document
Advertisements