ఫైబర్ విగ్రహాలకు అతనే రూపకర్త.. చేతి నిండా ఉపాధి

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:36 AM

ఫైబర్ విగ్రహాలకు అతనే రూపకర్త.. చేతి నిండా ఉపాధి

వివిధ రంగాలలో, వివిధ కళలలో నైపుణ్యం సంపాదించి, ప్రపంచానికి తమ కళలను కళాఖండాలను పరిచయం చేసేవారే శిల్ప కళాకారులుగ గుర్తిస్తారు. అయితే మనం తెలుసుకోవాల్సింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లోని కురిక్యాల గ్రామానికి చెందిన శిల్ప కళాకారుడు గురించి.. సముద్రాల ప్రభాకర్ అనే శిల్ప కళాకారుడు బతుకమ్మలతో తల్లి బిడ్డలు ఉన్న విగ్రహాలను చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.
సిమెంటు విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలు, దేశ నాయకుల విగ్రహాలు, మనుషుల విగ్రహాలను గత పది సంవత్సరాల నుండి తయారు చేస్తున్నానని అన్నారు కళాకారుడు ప్రభాకర్. కొన్ని విగ్రహాలను ఫైబర్ విగ్రహాలను, కొన్ని విగ్రహాలను సిమెంటు విగ్రహాలను రూపొందిస్తున్నామని తెలిపారు.కాగా ఎంతో తక్కువ ఉన్నప్పటికి కోరిన విధంగా విగ్రహాలు తయారు చేసి ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు ప్రభాకర్. సమయం తక్కువ ఉన్నందున హైదరాబాద్ నుంచి వర్కర్ లను తీసుకువచ్చి ఈ విగ్రహాలు రూపొందించామని అన్నారు. అందువల్లన అనేక రకాల పూలతో పేర్చిన బతుకమ్మను తలపై పెట్టుకున్న తల్లి తన చెంతనే ఉన్న బిడ్డ రూపంలో తయారైన అపురూప ఫైబర్ విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆయన కళకు తగిన గుర్తింపు లభిస్తోంది.
తనకు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు బతకమ్మ విగ్రహాలు తయారు చేయాలని కోరగా వారి ఆర్డర్ మేరకు ఈ బతుకమ్మ తల్లి బిడ్డల విగ్రహాలను తయారు చేయడం జరిగిందంటున్నారు శిల్ప కళాకారుడు సముద్రాల ప్రభాకర్. ఆడపడుచులు అందరు ఎంగిలిపూల బతుకమ్మ నుండి ప్రారంభమైన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు నిర్వహించుకుంటారని తెలిపారు. ఆ ఇష్టంతోనే గ్రామాలలో బతుకమ్మ పండుగకు ప్రతీకగా ఈ బతుకమ్మ తల్లి బిడ్డల విగ్రహాలను ప్రతిష్టించుకుంటారని తెలిపారు.
ఈ బతుకమ్మ తల్లి బిడ్డల విగ్రహాలను దాదాపు నెల రోజులు నుండి తయారు చేస్తున్నానని ఇప్పటివరకు తయారు చేసిన చాలా విగ్రహాలు ఆయా గ్రామాలకు తీసుకువెళ్లారని ఇంకా బతుకమ్మ తల్లిబిడ్డల విగ్రహాలను తయారు చేయాలని ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ సందర్బంగా రూపొందించిన బతుకమ్మలను తలపై పెట్టుకున్న తల్లి తన చెంతనే ఉన్న బిడ్డ రూపముతో రూపొందించిన అపురూప ఫైబర్ విగ్రహాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయని సంతోషాన్ని వ్యక్త చేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరింత దేవతమూర్తుల రాజకీయ నాయకుల విగ్రహాలను తయారు చేస్తానని చెప్పుకోచ్చాడు.. ప్రభుత్వం సహకారం అందిస్తే రానున్న రోజుల్లో మరెన్నో విగ్రహాలు తయారు చేసి అబ్బరపరుస్తానని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements