ముంబై హోటల్ లో ఓ మోడల్ అనుమానాస్పద మృతి..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:53 AM

ముంబై హోటల్ లో ఓ మోడల్ అనుమానాస్పద మృతి..

అంధేరీ ప్రాంతంలో మోడల్ ఆకాంక్ష మోహన్ అనే యువతి రాత్రి 8 గంటల ప్రాంతంలో హోటల్ లో దిగింది. ఆమె డిన్నర్ కు ఆర్డర్ పెట్టింది. ఆ తర్వాత హౌస్ కీపింగ్ ఎన్నిసార్లు కాల్ చేసిన ఆన్సర్ లేదు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మరో కీతో రూమ్ డోర్ ను తెరిచారు. అప్పుడు మోడల్ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
పక్కన టెబుల్ మీద ఒక సూసైడ్ నోట్ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దానిలో‘నన్ను క్షమించండి. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి" అని ఉంది. వెర్సోవా పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements