ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఎక్కడ ఉందో మీకు తెలుసా..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 12:24 PM

ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఎక్కడ ఉందో మీకు తెలుసా..

ఓ వ్యక్తికి అనుకోకుండా అడవిలో కనిపించిన అరుదైన పుష్పం. దాని చూసి అతను ఆశ్చర్యపోయాడు. మన భూమిపై అత్యద్భుతాల్లో అది ఒకటి. అరుదైన పుప్పు. ఒక్కటి రావాలన్నా కొన్నేళ్లు పడుతుంది. ఆ పువ్వుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దాన్ని చూసి ఎంత బాగుందో అంటున్నారు. మరి అది ఎలాంటిది దాని ప్రత్యేకతలేంటి ఎక్కడ పూసింది అనేది తేలుసుకుందం.
ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పంగా రాఫ్లేసియా ఆర్నాల్డి అనే పుష్పం ప్రసిద్ధిగాంచింది. ఈ పువ్వును బీట్ చేసే పువ్వును ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు. అందుకోసమే ఇది పెద్ద పుష్పంగా రికార్డుల్లో ఉంది. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. కానీ ఈ పుష్పం వికసించే సమయంలో ఘోరమైన దుర్వాసన వస్తుంది. ఇది 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. అంతేకాకుండా 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. నౌ దిస్ అనే ట్విటర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న పువ్వు పూర్తిగా వికసించి ఉంది. ఇది ప్రపంచంలో ఉండే అరుదైన పుష్పాలలో ఒకటిగా పేరు గాంచింది.
ప్రపంచంలోని చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసిన అనేక మంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారు చేసే కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పుష్పం గ్రహంతర వాసుల నుంచి వచ్చిందా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. https://twitter.com/i/status/1574930137623105536





Untitled Document
Advertisements