టీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలు అవినీతికి నిలయాలు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 12:31 PM

టీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలు అవినీతికి నిలయాలు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనను నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ & టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. "హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలు చిన్న పాటి వర్షానికి కూడా నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 2014 నుండి ప్రతి వర్షాకాలంలో దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని టిఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే గత ఎనిమిదేళ్లుగా ఏమీ మారలేదు. ఈ సంవత్సరం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, పలు కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నిధుల లేమి కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పెద్దగా పనులు చేపట్టలేకపోతోంది. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పరిస్థితి భిన్నంగా లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు.





Untitled Document
Advertisements