ఫార్మా పరిశ్రమలో కెమికల్‌ లికేజ్.. ఆసుపత్రి భారిన పడ్డ కార్మికులు

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 02:27 PM

ఫార్మా పరిశ్రమలో కెమికల్‌ లికేజ్.. ఆసుపత్రి భారిన పడ్డ కార్మికులు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్‌ గ్రామ శివారులోని అరబిందో ఫార్మా యూనిట్‌-9 పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది.
9 మంది కార్మికుల కళ్లకు హాని జరగడంతో ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 28న పరిశ్రమలోని ఈ బ్లాక్‌లో రియాక్టర్‌లో కెమికల్‌ బ్యాచ్‌ వేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు. ఉడికిన రసాయనాల నుంచి వెలువడిన ఘాటైన వాసన, వేడి, ఆవిరితో అక్కడ విధి నిర్వహణలో ఉన్న కార్మికులు కోటిరెడ్డి, అనంతరెడ్డి, సంజయ్‌, రజీప్‌, సుధాకర్‌, రాంచందర్‌, శశాంకిమాతో, అజీత్‌మాతో, ప్రీతమ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని తొలుత సంగారెడ్డి సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుంచి పంజాగుట్టలోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. కాగా పరిశ్రమలో భద్రత ప్రమాణాలు లోపించడంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. సంగారెడ్డి సమీపంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని శుక్రవారం భాజపా నాయకులు పరామర్శించారు. ఈ విషయమై పరిశ్రమ ప్రతినిధి ఉపేందర్‌రెడ్డిని కోరగా ప్రమాదం జరగలేదని, రియాక్టర్‌ వద్ద వెలువడిన రసాయనాల ఆవిరితో కొంత మంది కార్మికులకు కళ్లల్లో మంట వచ్చిందన్నారు. ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వారి కళ్లకు ఎలాంటి ఆపాయం లేదని వైద్యులు చెప్పారని తెలిపారు.





Untitled Document
Advertisements