అక్టోబర్ నెలలో పుట్టిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే?

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 03:02 PM

అక్టోబర్ నెలలో పుట్టిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే?

ప్రతి వ్యక్తికి, వ్యక్తిత్వానికి తేడ ఉంటుంది. అందరిలోనూ మంచి, చెడు వంటి లక్షణాలను సాధారణంగా ఉంటాయి. అయితే అక్టోబర్ నెలలో పుట్టిన వారికి మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరి మనసునైనా సులభంగా ఆకట్టుకుంటారు. వీరు అందరిపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతారు. చాలా శక్తిని కలిగి ఉంటారు. వీరి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
​మానసికంగా స్థిరంగా : ఈ నెలలో పుట్టిన వారి గొప్పదనం ఏంటంటే తమ భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇతరులపై తమ కోపాన్ని వ్యక్తం చేయరు. తమ కోపం బయటకు రాకుండా చూసుకుంటారు. వీరు అందరినీ సమానంగా చూస్తారు. ఎల్లప్పుడూ నిజాలనే మాట్లాడతారు. అయితే వీరిని ఎవరైనా మోసం చేస్తే సహించలేరు. మోసం చేసే వారికి త్వరగా గుర్తిస్తారు.
కూల్ గా ఉంటారు : అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా కూల్ గా ఉంటారు. అందుకే వీరికి ప్రత్యర్థుల కంటే ఎక్కువగా మిత్రులు ఉంటారు. వీరు ఎల్లప్పుడూ తమ కలల ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరైనా తమ పట్ల చెడుగా ప్రవర్తిస్తే చాలా బాధపడతారు.
రొమాంటిక్ గా ఉంటారు : వీరు ఎవరితో అయినా ప్రేమలో పడితే, ఆ విషయం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడరు. తమ భాగస్వామితో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు రిలేషన్ షిప్ విషయంలో పూర్తి నిజాయితీతో ఉంటారు. అయితే భాగస్వామి నుండి అదే విషయాన్ని ఆశిస్తారు.
​ఆశావాదిగా ఉంటారు : లక్ష్యాలను సాధించడంలోనూ వీరు ముందుంటారు. ఎలాంటి వైఫల్యాలు వీరిని ఆపలేవు. వీరి సానుకూల ఆలోచన కారణంగా, విజయాలను సులభంగా సాధిస్తారు. కష్ట సమయాల్లో కూడా ధైర్యాన్ని కోల్పోరు. ఇతరులను మంచిగా చేసేలా ప్రేరేపించడం వల్ల మంచి టీమ్ లీడర్ గా ఎదుగుతారు.
​ప్రతి సమస్యకూ పరిష్కారం : అక్టోబరులో పుట్టిన వారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకూ పరిష్కారం ఉంటుంది. వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి పరిష్కారాలను కనుగొంటారు. వీరిని ఏదైనా సలహా అడగాలనుకుంటే, వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకుని వివరిస్తారు. వీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవించడానికి ఇష్టపడతారు.
​విపరీతంగా ఖర్చు పెడతారు : వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ.. డబ్బు విషయంలో మాత్రం చాలా అజాగ్రత్తగా ఉంటారు. డబ్బును తమతో పాటు ఇతరులకు కూడా చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరి గురించి ఎక్కువ శ్రద్ధ వహించే వారి కోసం విపరీతంగా ఖర్చులు చేస్తారు. వీరు ఎక్కువగా విలాసవంతంగా ఉండేందుకు ఇష్టపడతారు.





Untitled Document
Advertisements