కాకినాడలో రెచ్చిపోతున్న బైక్‌ దొంగలు విచారణలో విస్తుపోయిన పోలీసులు..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 03:15 PM

కాకినాడలో రెచ్చిపోతున్న బైక్‌ దొంగలు విచారణలో విస్తుపోయిన పోలీసులు..

కాకినాడ ప‌రిధిలోకి వ‌చ్చే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఏడాది కాలం నుండి మోటారు సైకిళ్ల దొంగ‌త‌నాలు బాగా పెరిగిపోయాయి. ఇంటి ముందు తాళం వేసిన బైక్‌లు కూడా మాయ‌మ‌వుతున్నాయి.
ప్రస్తుత ప్రపంచంలో ర‌కర‌కాల క్రేజీ బైక్‌లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ముఖ్యంగా పేరెంట్స్ వారి పిల్లలు ఏ ర‌కం బైక్ అడిగితే ఆ బైక్‌ను కొనేస్తున్నారు. ఏడాది దాటితే చాలు మార్కెట్‌లో కొత్త కొత్త బైక్‌లు పుట్టుకొస్తున్నాయి. అలాంటి బైకులే ల‌క్షంగా చేసుకుని కాకినాడ జిల్లాలో ఓ ముఠా రెచ్చిపోయింది. కాకినాడ జిల్లా కాకినాడ ప‌రిధిలోకి వ‌చ్చే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఏడాది కాలం నుండి మోటారు సైకిళ్ల దొంగ‌త‌నాలు బాగా పెరిగిపోయాయి. ఇంటి ముందు తాళం వేసిన బైక్‌లు కూడా మాయ‌మ‌వుతున్నాయి. తాజాగా ఏలేశ్వరంలో ఓ బైక్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేయగా..విచారణలో వారు చెప్పిన బైక్ దొంగ‌త‌నం వివ‌రాలు తెలుసుకుని విస్తుపోయారు.
జిల్లాలోని ఏలేశ్వరం కేంద్రంగా ఓ ముఠా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, అన్నవ‌రం, పిఠాపురం, పెద్దాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో విప‌రీతంగా బైక్‌ల‌ను దొంగిలిస్తోంది. ముఖ్యంగా స్టూడెంట్స్ బైక్‌తోపాటు, ఉపాధ్యాయులు, వ్యాపారుల బైక్‌ల‌ను టార్గెట్‌గా పెట్టుకుని దొంగ‌త‌నాల‌కు పాల్పడుతోంది ఈముఠా. ఎలాంటి బైక్ తాళాన్నైనా వారు చాక‌చ‌క్యంగా తొల‌గిస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా బైక్‌లు తాళాలు ఎలా తీయాల‌నే దానిపై ప‌లువురి నుండి సూచ‌న‌లు కూడా తీసుకుని ప్రావీణ్యం పొందారు. 60 వేల బైక్ నుండి 2 ల‌క్షల రూపాయాల ఖరీదైన బైక్‌లు వీరి ల‌క్ష్యం. మార్కెట్ సెంట‌ర్లు, ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్ల బ‌య‌ట పెట్టిన బైక్‌ల‌తోపాటు, ముఖ్యంగా రాత్రుళ్లు ఇంటి బ‌య‌ట పార్క్‌ చేసిన బైక్‌ల‌ను చోరీ చేయ‌డం ఈ ముఠా టార్గెట్‌. దొంగిలించిన బైక్‌ల‌ను కొన్నింటిని పార్టులుగా విభ‌జించి అమ్మేయ‌డం కూడా వీరికి వెన్నతో పెట్టి విద్య .
నిఘా ఉంచిన ప్రత్యేక పోలీస్ టీమ్ 9 మందితో కూడిన ముఠాను తాజాగా అరెస్టు చేశారు. మొత్తం 29 మోటార్ బైక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10,22,000 లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు పోలీసులు. అయితే నిందితులంద‌రూ ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వారే.
నిందితులు ఏలేశ్వరానికి చెందిన పాండ్రంకి అప్పారావు( బాబీ), కోన ప్రసాదరావు (పండు) , కారంగి ఏసుదాసు(దాసు), ముత్యాల రాంబాబు (రాము), ఇల్లరపు రమేశ్, మండల దుర్గా వీర ప్రసాద్ (బ్రిటీష్), ముత్యాల శివ శ్రీనివాస్, కోలా సూరిబాబు, తోట వీర , గంగాధర్(దొరబాబు) లుగా గుర్తించారు. వీరందిరిని అరెస్టు చేసిన‌ట్లు పెద్దాపురం డీఎస్పీ సుంక‌ర ముర‌ళీమోహ‌న్ తెలిపారు.





Untitled Document
Advertisements