బాలీవుడ్ వైపు సమంత చూపు...

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 03:38 PM

బాలీవుడ్ వైపు సమంత చూపు...

తెలుగు లో అగ్ర కథానాయిక అయిన సమంత ప్రస్తుతం విదేశంలో వున్నట్టు కరణ్ జోహార్ షో ద్వారా అర్థం అయింది. సమంత బెస్ట్ ఫిమేల్ సెలిబ్రిటీ గా అవార్డు గెలిచింది అని కరణ్ వెంటనే సమంత కి ఫోన్ చేశాడు. అయితే అది ఇంటర్నేషనల్ రింగ్ అవుతోందని తనే చెప్పాడు. సమంత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ అర్థం అయిన విషయం ఏంటి అంటే, సమంత ఇండియాలో లేదు, విదేశాల్లో వుంది అని. ఇంకా ఇండియా ఎప్పుడు వస్తుందో తెలియదు అని ఆమె తదుపరి సినిమా యశోద యూనిట్ లో ఒకరు చెప్పారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అయితే సమంతా ఈ సినిమాని హిందీలోకి బాగా తీసుకు వెళ్లాలని అనుకుంటునట్లు తెలుస్తుంది. యశోద సినిమా టీజర్ ని ఈమధ్య విడుదల చేశారు. అయితే హైదరాబాద్ లోని సినిమాహాల్స్ లో ఈ సినిమా టీజర్ హిందీలో చూపిస్తున్నారు ఎక్కువగా. మల్టీప్లక్స్ లో అయితే హిందీలో మాత్రమే ఈ టీజర్ చూపించాలని ఆ సినిమా నిర్మాత చెప్పాడుట, అందుకని హిందీ టీజర్ చూపిస్తున్నారు అని తెలిసింది. ఆ సినిమాలో నటిస్తున్న సమంత దగ్గర నుండి వచ్చిన ఆదేశాల మేరకే నిర్మాత, దర్శకులు ఆ టీజర్ ని హిందీ లో ప్రోమోట్ చేస్తున్నారని తెలిసింది. సమంత ఈ సినిమా కోసం హిందీ లో ప్రచారం కూడా చేయాలని నిర్ణయించుకుందని కూడా తెలిసింది. పుష్ప లో చేసిన ఐటం సాంగ్ విపరీతమయిన క్రేజ్ ఆమెకి తీసుకు వచ్చింది. అలాగే ఆమె చేసిన వెబ్ సిరీస్ ఫ్యామిలీమేన్ కూడా బాగా హిట్ అవటంతో సమంతా ఫోకస్ అంతా ఇప్పుడు హిందీ మీదే వుంది అని తెలిసింది. అయితే డైరెక్ట్ గా హిందీ సినిమా చేయకపోయినా, తెలుగు సినిమానే హిందీలోకి డబ్ చేసి ప్రోమోట్ చేయాలని భావిస్తోంది. అందుకే యశోదని సినిమాని హిందీలో విడుదల చేయడానికి కరణ్ జోహార్ సహాయం కూడా తీసుకుంటుంది అని అంటున్నారు సినిమావేతలు.





Untitled Document
Advertisements