స్ప్రౌట్స్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 03:50 PM

స్ప్రౌట్స్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా?

కావలసినవి :200 గ్రాముల పెసర్లు, 100 గ్రాముల మినప పప్పు, 1/2 టిస్పూన్ మెంతులు, 1 స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు బేకింగ్ సోడా
తయారీవిధానం : మొలకల ఇడ్లీలో ముందుగా మీరు పెసర్లతో మొలకలు చేసుకోవాలి. ఒకరోజు ముందు పెసర్లను కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసివేసి ఒక మస్లిన్ గుడ్డలో పెసర్లను 8 గంటల పాటు ఉంచాలి. అప్పుడు వెళ్లి చూస్తే మొలకలు మొలిచి ఉంటాయి. వీటిని వెంటనే ఇడ్లీల తయారీకి ఉపయోగించాలి లేదా ఫ్రిజ్‌లో భద్రపరచాలి. మరోవైపు మినపపప్పును కూడా మెంతులతో కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. అనంతరం ఈ పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఇక, మొలకెత్తిన పెసర్లను కూడా విడిగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న ఈ రెండు పప్పు బ్యాటర్లను ఒక గిన్నెలో కలిపేసి, మూతపెట్టి మరో 2 గంటల పాటు పులియబెట్టాలి. అనంతరం ఉప్పు, బేకింగ్ సోడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారైన మెత్తని పిండి బ్యాటర్ ను ఇడ్లీ పాత్రలో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ ఇడ్లీలు రెడీ అయినట్లే. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి.





Untitled Document
Advertisements