కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును పరామర్శించిన కేసీఆర్

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 05:10 PM

కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును పరామర్శించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా కాని పార్టీ సీనియర్ నేత‌ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికి తప్పక వెళ్తారు. ఎంత బిజీగా ఉన్న కాని లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్ళడం మాత్రం మానరు. గ‌తంలో చాలా సార్లు వ‌రంగ‌ల్ వెళ్లిన కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల‌నుకున్నా, రాత్రికి న‌గ‌రంలోనే బ‌స చేయాల‌నుకున్నా నేరుగా కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికే వెళ‌తారు. ఇటీవల వ‌ర‌ద ప్రాంతాలను పరిశీలించడానికి వ‌రంగ‌ల్ వెళ్లిన ముఖ్యమంత్రి‌‌, రెండు రోజుల పాటు ల‌క్ష్మీకాంత‌రావు ఇంటిలోనే బ‌స చేశారు. తాజాగా శ‌నివారం వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్‌, శ‌నివారం మ‌ధ్యాహ్నం కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటికి వెళ్లి ఇటీవ‌లే అనారోగ్యానికి గురైన ల‌క్ష్మీకాంత‌రావును ప‌రామ‌ర్శించారు. ల‌క్ష్మీకాంత‌రావు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.





Untitled Document
Advertisements