తాజ్ మహల్ కట్టించింది షాజహాన్ కాదు?

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 05:16 PM

తాజ్ మహల్ కట్టించింది షాజహాన్ కాదు?

తాజ్ మహల్ ఎవరు నిర్మించారు అన్న దానిపై త్వరగా స్పష్టతనిచ్చి, వివాదాలను ఆపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. డాక్టర్ రజనీశ్ సింగ్ అనే వ్యక్తం ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించినట్టు చెపుతున్నప్పటికీ దానికి చారిత్రక ఆధారాలు లేవని పిటిషన్ లో ఆయన తెలిపారు. ముంతాజ్ కోసం షాజహాన్ 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ల పాటు తాజ్ మహల్ ను నిర్మించారని చెపుతున్నప్పటికీ దానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. ఇదే అంశంపై క్లారిటీ కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కు సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశానని... అయితే, ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్టు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని సమాధానం వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇవ్వలేదని చెప్పారు. ఈ పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ ఇంకా స్పందించాల్సి ఉంది.





Untitled Document
Advertisements