జాతీయ పార్టీలోకి ప్రముఖ సినీ నటుడుని ఆహ్వానిస్తున్న కేసీఆర్..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:32 AM

జాతీయ పార్టీలోకి ప్రముఖ సినీ నటుడుని ఆహ్వానిస్తున్న కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుకు అంతా సిద్ధమవుతోంది. దసరా రోజున మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కొత్త పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.
కొత్త పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయన.. ఏయే రాష్ట్రాలపై ఫోకస్ పెడతార లేదా అక్కడ ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పుతారన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రపై ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పాత హైదరాబాద్‌ సంస్థానంలోని భాగంగా ఉన్న ప్రస్తుతం కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్.. కేసీఆర్ కొత్త పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనియాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్ కొత్త పార్టీలో చేరబోతున్నారని.. ఆయన స్వస్థలం కర్నాటక కావడంతో, పార్టీ కర్నాటక బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తారని సమాచారం. కర్నాటలో జేడీఎస్ పార్టీలో కేసీఆర్ కొత్త పార్టీ పొత్తు పెట్టుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల జేడీఎస్ ముఖ్య నేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్‌ వచ్చి.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వీరిద్దరి మధ్య కర్నాటక రాజకీయాలతో పాటు పొత్తులకు సంబంధించి చర్చి జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దసరా సందర్భంగా అక్టోబరు 5న తెలంగాణ భవన్‌లోలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ భేటీలో జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తయిన కారునే జాతీయ పార్టీకి కూడా తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే తీర్మానాన్ని ఇప్పటికే ఖరారు చేశారు. అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేయనుంది. అనంతరం కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్(భారతీయ రైతు సమితి)గా మార్చనున్నట్లు తెలిసింది.





Untitled Document
Advertisements