ట్రిపుల్‌ ఐటిలో విజయం సాదించిన గ్రామీణ విద్యార్థులు..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:40 AM

ట్రిపుల్‌ ఐటిలో విజయం సాదించిన  గ్రామీణ విద్యార్థులు..

ఈ ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు. గరివిడి మండలంలోని తాటిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 562 మార్కులు సాధించిన చుక్క దుర్గకు ట్రిపుల్‌ ఐ.టి.
శ్రీకాకుళంలో సీటు రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, గ్రామ సర్పంచ్‌ ఎడ్ల వెంకట లక్మి, రమణమ్మ, సొసైటీ అద్యక్షులు ఎడ్ల అప్పారావు, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మెన్‌ వల్లూరి గౌరునాయుడు, వైస్‌ చైర్మన్‌ వెంకట లక్మి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ పెద్దలు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని దేవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 576 మార్కులు సాధించిన కరణం గణేష్‌ త్రిపుల్‌ ఐటీ నూజివీడులో సీటు వచ్చిందని ఆ పాఠశాల హెచ్‌ఎం కల్లూరి పద్మావతి తెలిపారు. అలాగే గరివిడి జెడ్‌పిహెచ్‌ఎస్‌లో చదివిన అలమండ షాలిని, శివరాం జిల్లా పరిషత్తులో చదివిన దన్నాన మణికంఠ, బడిగంటి రేణుకలు కూడా ఎంపికయ్యారు.
రేగిడి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి యండమూరి సూర్య పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు మరడాన రామినాయుడు తెలిపారు. నూజివీడులో బీటెక్‌ కోర్సునకు ఎంపికైనట్లు చెప్పారు. విద్యార్థి త్రిబుల్‌ ఐటీకి ఎంపిక పట్ల సర్పంచ్‌ కిమిడి రవి శంకర్‌, మండల విద్యా శాఖాధికారి ప్రసాద రావు, విద్యా కమిటి చైర్మన్‌ ఎం రామ కృష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
శృంగవరపుకోట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పట్టణానికి చెందిన వెలగాడ సందీప్‌, మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెంట సత్యనారాయణ, బి లక్ష్మీ తెలిపారు. గత మే నెలలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన గొర్లే శ్రీ హర్ష దీపక్‌ (581) నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి అత్యధిక మార్కులు సాధించిన మరో విద్యార్థిని కండిబోయిన లహరిశ్రీ (560)ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైనట్లు హెచ్‌ఎం బి లక్షీ తెలపగా వెలగాడ సందీప్‌ (568) సాధించి శ్రీకాకుళం త్రిబుల్‌ ఐటీలో చోటు సాధించాడని ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
వంగర మండలంలోని ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటికి ఎంపికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన డిరు అఖిల, ఎస్‌ యమున, జి. శాంతి కుమారి, ఎం హేమంత్‌ కుమార్‌, ఎం నలిని ఈ ఐదుగురూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఫలితాల్లో సత్తాచాటారు. వీరి ఎంపిక పట్ల ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రవణమ్మ, ఉపాధ్యాయులు జయకృష్ణ, రాముడు, సత్తిబాబు, రామకృష్ణ, నరసింహ హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులను అభినందించారు.
బాడంగి బాడంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి కె.తరుణ్‌, వై.సాయిలక్ష్మి, ఎం.సోమశేఖర్‌ ట్రిపుల్‌ ఐటి సీట్లు పొందారని హెచ్‌ఎం ఎస్‌.త్రినాథరావు తెలిపారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి, ట్రిపుల్‌ ఐటికి ఎంపికైనట్లు వెల్లడించారు. పాఠశాలలో నాణ్యమైన బోధనకు ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. వీరిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
బొబ్బిలి పెంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటికి ఎంపికయ్యారు. ఇందులో నాయుడు ధరణి, గేదెల రాజేశ్వరి, సింగరెడ్డి అశ్వినిలు శ్రీకాకుళం ఐఐటికి, గుల్లిపల్లి మహేశ్వరి ఒంగోలు ఐఐటికి ఎంపికయ్యారు.
పూసపాటిరేగ ట్రిపుల్‌ ఐటీకి మండలంలోని ఓక్లాండ్‌ విధ్యార్ధి చుక్క జీవన్‌ సాయి ఎంపికైనట్లు ఓక్లాండ్‌ ప్రిన్సి పాల్‌ సిహెచ్‌.రవి గురువారం తెలిపారు. జీవన్‌ సాయి పదో తరగతి పరీక్షల్లో 582 మార్కులు సాధించడంతో ఆర్‌జియుకెవి శ్రీకాకుళం క్యాంపస్‌కి ఎంపికయ్యాడని తెలిపారు. జీవన్‌సాయిని కరస్పాండెంటు పాల్‌శ్రీనివాస్‌ అభినందించారు.
నెల్లిమర్ల రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి అలుగోలు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్‌ఎం నల్లా జగదీశ్వరరావు తెలిపారు. కరుమజ్జి తిరుపతి రావు, నవగొట్ల అంజలి, రెడ్డి రమ్య ఆర్‌జియకెవి ఐఐఐటికి ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ముగ్గురు పేద విద్యార్దులు నాలెడ్జ్‌ టెక్నాలజీకి ఎంపికవ్వడం హర్షణీయమని తెలిపారు.





Untitled Document
Advertisements