28 ఏళ్లకే 24 పెళ్ళిళ్ళు వీడు మామూలోడు కాదు..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 10:52 AM

28 ఏళ్లకే 24 పెళ్ళిళ్ళు వీడు మామూలోడు కాదు..

పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అపురూపమైన వేడుక. కానీ కొందరు మాత్రం వివాహానికి ఉన్న ప్రాముఖ్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. స్వలాభం కోసం చెలగాటమాడుతున్నారు. డబ్బులు, నగలు, శారీరక ఆనందం కోసం ఒకటి కి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా చేయడంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పోతున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 28 సంవత్సరాల వయసులోనే ఓ వ్యక్తి ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అనంతరం వారి దగ్గర ఉన్న బంగారం, డబ్బు ఎత్తుకొని ఉడాయించేవాడు. ఇలా అతని చేతిలో మోసపోయిన యువతులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ లోని అసబుల్ మొల్లా అనే యువకుడు సాగర్ దిగీ ప్రాంతంలో ఉండే వారు. అక్కడ ఉండే ఓ యువతితో పరిచయం పెంచుకున్న అతడు.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి యువతి కూడా ఒప్పుకుంది. వేదమంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు.
కానీ పెళ్లయిన కొన్నాళ్లకే యువకుడి తీరు మారింది.ఈ క్రమంలో అతడు ఇంట్లో నుంచి నగలు తీసుకుని పారిపోయాడు. ఇంట్లో బంగారం, ఆర్నమెంట్స్ కనిపించకపోవడంతో యువతి అలర్ట్ అయింది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ చోరీకి పాల్పడింది అసబుల్ అని గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసబుల్ పశ్చిమ బెంగాల్ లోనే కాకుండా పొరుగున ఉన్న బిహార్‌లోనూ పెళ్లిళ్ల బాగోతానికి తెర లేపాడు. డ్రైవర్ అని, అడ్డా కూలీ అని మారు పేర్లు, మారు వృత్తులు చెప్పుకుని, నకిలీ ఆధార్, ఐడీ కార్డులు సంపాదించాడు. వాటిని అడ్డుపెట్టుకుని అమ్మాయిలను మభ్య పెట్టేవాడు. పెళ్లి చేసుకుని, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లడం అలవాటుగా చేసుకున్నాడు.
ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా అసబుల్ చేతిలో మోసపోయిన యువతులు ఒకరొకరే బయటికొచ్చి తమ ఆవేదన చెప్పుకుంటుండంతో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.





Untitled Document
Advertisements