తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:36 PM

తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు..

తల నొప్పి పెట్టె భాద అంత ఇంత కాదు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వేధిస్తున్న అతి పెద్ద సమస్య తల నొప్పి. ఈ నొప్పి వస్తే కుదురుగా కుర్చోనివదు. తల పగిలిపోయినట్లు అనిపించే ఈ బాధ నుంచి బయటపడేందుకు చాలామంది మందులు వేసుకుంటారు. అయితే, పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. తలనొప్పుల్లో 200 పైగా రకాలున్నాయట. వాటిలో వచ్చే తలనొప్పి ఎలాంటిందనేది కచ్చితంగా అంచనా వేయడం కష్టమే. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులు కూడా ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు, లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచుగా తలనొప్పి వస్తున్నట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఇది సున్నితమైన రక్తనాళలు, మెదడుకు సంబంధించిన సమస్య. కాబట్టి అస్సలు అజాగ్రత్త వద్దు. సాధారణంగా వచ్చే తలనొప్పుల నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే ఈ కింది చిట్కాలను పాటించండి.
* ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.
* గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట.
* తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.
* కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
* టీ లేదా మాంచి కాఫీని తాగడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుంది.
* తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి తక్కువగా ఉండే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోండి.
* కొద్దిగా వెల్లులిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది.
* తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలాబాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త నడి నెత్తి మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
* విటమిన్-సి , డి, బి -12, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
*మంచి నిద్ర, వ్యాయమం తలనొప్పిని దరిచేరకుండా మిమ్మల్ని రక్షిస్తాయి.





Untitled Document
Advertisements