నోరూరించే మోతీచూర్ లడ్డూ ఇంట్లోనే సులభంగా చేసేయండిలా..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 02:50 PM

నోరూరించే  మోతీచూర్ లడ్డూ ఇంట్లోనే సులభంగా చేసేయండిలా..

అందరికి స్వీట్స్ అంటే చాల ఇష్టం అందులో మొతీచూర్ లడ్డు అయతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు ఉనంత టేస్ట్ ఇంకా ఏ స్వీట్ ఉండదు. అంత అద్భుతమైన స్వీట్ ఇది. ఇప్పుడు మొతీచూర్ లడ్డు ఇంట్లోనే ఎలా చేయాలో చుసేదం
కావాల్సిన పదార్థాలు: శెనగ పిండి - 2 కప్పులు, కొద్దిగా ఫుడ్ కలర్, పంచదార - 2 కప్పులు, కొంచెం యాలకుల పొడి, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, నూనె, బాదం, పిస్తా, కాజు.
తయారీ విధానం: ఒక బౌల్ లో శెనగపిండి వేసుకుని, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. తర్వాత నీళ్లు పోసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. తర్వాత వేరే బాండీ తీసుకుని అందులో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బూందీ తీసుకోవాలి. సన్నని రంధ్రాలు ఉన్న బూందీ జారా నుండి మాత్రమే బూందీ తీసుకోవాలి. బూందీ మంచి రంగు వచ్చాక తీసేసుకోవాలి. తర్వాత మరో గిన్నెలో నీళ్లు పోసుకుని తర్వాత చక్కెర వేసి గులాబ్ జామూన్ కు ఉన్నట్లుగా పాకం తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకోవాలి. అందులో బూందీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకులు పొడి, బాదం, పిస్తా, నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలు తయారు చేసుకోవాలి. అంతే గుమగుమలాడే మోతీచూర్ లడ్డూ తయారైనట్లే.

Untitled Document
Advertisements