క్రిస్పి స్నాక్ బ్రెడ్ కట్ లెట్ రేసీపి..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 04:21 PM

క్రిస్పి స్నాక్ బ్రెడ్ కట్ లెట్ రేసీపి..

పిల్లలు బ్రెడ్ అంటే అంత ఇష్టంగా తినరు. ఏదైనా డిఫరెంట్ గా చేస్తే మాత్రం తింటారు. మనం బ్రెడ్ తో చాల రకాల స్నాక్స్ చేసుకోవొచ్చు అలాగే స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రెడ్ తో తేటి స్నాక్ బ్రెడ్ కట్ లెట్ చేసేదం
కావలసిన పదార్థాలు : బ్రెడ్‌ స్లయిస్‌లు - 4, ఉడికించిమెదిపిన ఆలూ - 2 ఉప్పు,కారం, గరం మసాల పొడి - 1/2 టీ స్పూను చొప్పున, పసుపు - 1/2 టీ స్పూను, ఉల్లి తరుగు -1 టేబుల్‌ స్పూను కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు ,నూనె - వేగించడానికి సరిపడా, బ్రెడ్‌ పొడి/గసగసాలు - 1/2 కప్పు, మైదా - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకోని అందులో నీళ్ళు పోసి బ్రెడ్‌ స్లయిస్‌లను వేసి 20 సెకన్లు ఉంచి వెంటనే తీసి పిండేయాలి.
తర్వాత ఒక పాత్రలో మిగతా పదార్థాలు వేసి ముద్ద చేసుకోవాలి. దళసరిగా చపాతీలా బ్రెడ్‌ గా వత్తుకుని (పిల్లలు ఇష్టపడే) షేపులో కట్‌ చేసుకోవాలి. వీటిని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్‌ పొడి లేదా గసగసాలు అద్ది తరువాత స్టవ్ మీద గిన్నెపెట్టి అందులో నూనె పోసి వేడి ఎక్కాక బ్రెడ్‌ కట్ లెట్ వేసుకొని దోరగా వేగించాలి. అంతే బ్రెడ్ కట్ లెట్ రెడీదీన్నీ ఈవెనింగ్ స్నాక్ టైమ్ లో తీసుకోవచ్చు.

Untitled Document
Advertisements