నిందితుడికి వేసిన శిక్షకు గ్రామ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 03:48 PM

నిందితుడికి వేసిన శిక్షకు గ్రామ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు పలు శిక్షలు విధించాలనే చట్టాలున్నాయి. కొన్ని కేసుల్లో కఠిన శిక్షలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అత్యాచార నిందితుడికి గ్రామ పెద్దలు విచిత్రమైన శిక్ష విధించారు. కేవలం ఐదు గుంజీలతో శిక్ష ముగించారు. ఈ ఘటన బీహార్ నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అరుణ్ పండిట్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానని నమ్మించి పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే గ్రామంలో కొందరు.. ఈ విషయాన్ని పంచాయితీలో తేల్చుకోమని సలహా ఇచ్చారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు.. పంచాయతీ పెద్దలను కలిశారు. జరిగిన విషయం చెప్పగా పంచాయితీ పెట్టారు. దానికి గ్రామస్థులందరూ హాజరయ్యారు.
అయితే ఈ కేసులో గ్రామ పెద్దలు ప్రవర్తించిన తీరు.. చెప్పిన తీర్పు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గ్రామపెద్దలు.. నిందితుడికి గ్రామ ప్రజల ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించారు. అంతకిమించి ఇంకేం చెప్పలేదు. దాంతో ఆ నిందితుడు ఐదు గుంజీలు చేసేసి చక్కగా కూర్చుండిపోయాడు. ఈ తీర్పుపై గ్రామంలో కొందరు మండిపడ్డారు. దాంతో నిందితుడు గుంజీలు తీస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన కొంతమంది గ్రామీణ భారతదేశంలోని పితృస్వామ్యానికి, అన్యాయమైన పద్ధతులకు ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నారు. ముందుగా నిందితుడిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌరవ్‌ మంగ్లా వెల్లడించారు. https://twitter.com/i/status/1595854967684104194





Untitled Document
Advertisements