దాంపత్య జీవితం బలపడాలంటే బెడ్ రూంలోనే కాదు.. బాత్ రూంలోనూ పంచుకోండి

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 08:52 PM

దాంపత్య జీవితం బలపడాలంటే బెడ్ రూంలోనే కాదు.. బాత్ రూంలోనూ పంచుకోండి

ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైనది భార్యాభర్తల బంధం. గతంలో భర్త ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే.. భార్య ఇళ్లు చక్కపెట్టుకుని భర్తకు సేవలు చేసుకునేది.
కానీ ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదు. సమయం కేటాయించుకోవడం లేదు. పని చేసే దగ్గర ఒత్తిడి కారణంగా ఇంట్లో ఇరువురు మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. అవి కాస్త పెద్ద పెద్ద గొడవలుగా పెరిగి దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటంటే..
ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యంగా ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. అయితే ఈ ఉరుకుల పరుగులు జీవితం, ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు ఇలాంటి వాటి వల్ల అవి కుదరవు అనుకోవచ్చు. కానీ, దంపతులు గుర్తుపెట్టుకోవాల్సింది.. మీకు మీ భార్య, మీ భర్త కన్నా ఈ లోకంలో ఏ బంధం, ఏ బాధ్యత ఎక్కువ కాదు. కాబట్టి మీకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. అదేవిధంగా బలహీన పడుతున్న మీ బంధాలను బలపరుచుకునేందుకు.. ఈ చిన్న చిట్కాను ఫాలో కావాలంటూ.. ఫ్యామిలీ,
మ్యారేజ్ కౌన్సిలర్ పద్మా కమలాకర్ చెబుతున్నారు. ఆవిడ చెప్తున్న చిట్కా ఏంటంటే.. భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయాలట. అవును మీరు విన్నది నిజమే. అలా భార్యాభర్తలు కలిసి స్నానం చేయడం వల్ల వారి మధ్య చక్కటి బంధం ఏర్పడుతుంది. ఒకరితో ఒకరు మానసికంగా, శారీరకంగా దగ్గరవుతారు. అదేవిధంగా వారి మధ్య మనస్పర్థలు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మ్యారేజ్ కౌన్సిలర్ పద్మా కమలాకర్. మరి ఇంకెందుకు ఆలస్యం.. బంధం బలపడాలంటే.. కేవలం బెడ్ రూంనే కాదు.. బాత్ రూంను పంచుకోండి మరి.





Untitled Document
Advertisements