సిని ఇండస్ట్రీ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ అగ్ర నిర్మాత‌..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 12:51 PM

సిని ఇండస్ట్రీ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ అగ్ర నిర్మాత‌..

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో దిల్ రాజు ఒక‌రు. స్టార్ హీరోల‌తో సినిమాల‌ను నిర్మిస్తూనే ఆయ‌న చిన్న హీరోల‌తోనూ మూవీస్ చేస్తుంటారు. కంటెంట్ బావుంద‌నిపిస్తే చిన్న సినిమాల‌ను సైతం ఆయ‌న త‌న ఎస్‌వీసీ బ్యాన‌ర్‌పై రిలీజ్ కూడా చేస్తుంటారు. దిల్ రాజు నిర్మాత‌గానే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గానూ సినిమా రిలీజెస్ విష‌యంలో కీల‌క పాత్రను పోషిస్తుంటారు. అలాంటి నిర్మాత రీసెంట్‌గా త‌మిళ చిత్రం ల‌వ్ టుడే అనువాదాన్ని తెలుగులో విడుద‌ల చేశారు. ఆయ‌న్ని ఓ వైపు మెచ్చుకునే వారున్నారు.. మ‌రో వైపు విమ‌ర్శించే వారూ ఉన్నారు. రీసెంట్‌గా ఓ సంద‌ర్భంలో ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ గురించి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ముఖ్యంగా సినీ నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్స్‌ను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడిన మాట‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
ఇంత‌కీ దిల్ రాజు త‌ను ఉంటున్న సినీ ప‌రిశ్ర‌మ‌పై ఎందుకు సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ఇంత‌కీ ఆయ‌న చేసిన కామెంట్స్ ఎలాంటివి అనే వివ‌రాల్లోకి వెళితే.. తాను ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్పుడు త‌న స్నేహితులు కొంత మంది రియ‌ల్ ఎస్టేట్‌ను ప్రారంభించార‌ని చెప్పిన దిల్ రాజు.. ఈ రోజు తాను మాత్రం నిర్మాత‌గా ఇక్క‌డే ఉన్నాన‌ని, కానీ త‌న స్నేహితులు ఎక్క‌డో ఉన్నారంటూ తెలిపారు. డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌కి ఎందుకు ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంద‌నే ప్ర‌శ్న‌పై దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. నిర్మాత‌లు కార‌ణంగానే డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ ప‌త‌నం అవుతుంద‌ని చెప్పిన ఈ స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మాత‌లు తాము నిర్మించిన సినిమాల‌ను డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి చూపించ‌కుండానే అమ్మేస్తున్నార‌ని అన్నారు.
ఇదే క్ర‌మంలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న స‌రికొత్త నిర్వ‌చ‌నాన్ని ఇచ్చారు. సినిమాలో సి అంటే సిగ్గు ని అంటే నీతి.. మా అంటే మానం లేనిది కాబ‌ట్టి ఉండ‌దు కాబ‌ట్టే సినిమా ప‌రిశ్ర‌మ అనే పేరు వ‌చ్చి ఉంటుంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఈ ఇంట‌ర్వ్యూ అందుబాటులోకి రానుంది. మ‌రి పూర్తి ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌ల గురించి.. వారసుడు సినిమాపై వస్తున్న వివాదాల గురించి ఏం మాట్లాడారో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వార‌సుడు సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది.

Untitled Document
Advertisements