రాజకీయ రైడ్స్ పై లాభనష్టాల గురించి చర్చించుకుంటున్నా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 12:58 PM

రాజకీయ రైడ్స్ పై లాభనష్టాల గురించి చర్చించుకుంటున్నా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు..

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీ, సిబిఐ ముమ్మర సోదాలు గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. దీనికోసం ఏకంగా ప్రత్యేక సిట్ ను నియమించిన ప్రభుత్వం పోటాపోటీగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఐటీ, ఈడీ రైడ్స్ చేసింది. టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా క్యాసినో కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాం, ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో సోదాలు జరిగాయి. బీజేపీ టార్గెట్ గా ఫామ్ హౌస్ కేసును ముమ్మరం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రాజకీయ రైడ్స్ లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా సీన్ మారింది. మరి ఈ రైడ్స్ వల్ల ఎవరికీ లాభం.. ఎవరికీ నష్టం జరుగుతుందనేది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు లో టీఆర్ఎస్ మంత్రి తలసాని బ్రదర్స్ ను, మంత్రి పీఏ ను, అలాగే మంత్రి కొడుకు తలసాని సాయి కిరణ్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక మిగిలింది తలసానినే. అయితే ఈ కేసులో ఈడీ ఏకంగా 300 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ కేసులో ఇంకెంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు హస్తం ఉందనే అనుమానంతో హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేసింది. ఇక ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసింది. మరి ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వెల్లడవుతాయో చూడాలి. ఇక తాజాగా టీఆర్ఎస్ మినిస్టర్ మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ తో నేతల్లో టెన్షన్ మొదలయింది. రానున్న రోజుల్లో మరింతమంది నాయకుల నివాసాల్లో సోదాలు జరుగుతాయని వారే జోస్యం చెబుతున్నారు. మొత్తంగా ఈడీ , ఐటి, సిబిఐ సంస్థలు చేసే రైడ్స్ ఇప్పుడు కారు పార్టీ నాయకులను కకావికలం చేస్తుంది. అయితే తాజా రైడ్స్ తో బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అవినీతి, అక్రమాలు, టాక్స్ కట్టకుంటే చర్యలు తీసుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపిస్తున్నారు. అయితే తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ రైడ్స్ లో పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ నాయకుల అవినీతిని బట్ట బయలు చేస్తే కేంద్రం వైపు సానుకూల పవనాలు వీస్తాయి. ఒకవేళ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ హస్తం ఉందని తేలితే ఆ అవకాశాన్ని టీఆర్ఎస్ ఆయుధంగా మలుచుకుంటుంది. మరి రానున్న రోజుల్లో రాజకీయ రైడ్స్ ఎవరికి ప్లస్ ఎవరికీ మైనస్ గా మారతాయో చూడాలి.





Untitled Document
Advertisements