తమ్మన్ పై రేచిపోతున్న ట్రోల‌ర్స్‌..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 01:16 PM

తమ్మన్ పై రేచిపోతున్న ట్రోల‌ర్స్‌..

సినిమాల‌కు సంబంధించిన కంటెంట్ బావుంటే సోష‌ల్ మీడియాలో ఎంత బాగా ప్ర‌మోట్ చేసుకుంటుంటారు మ‌న మేక‌ర్స్ వారికి నెటిజ‌న్స్ నుంచి కూడా మంచి స‌పోర్ట్ దొరుకుతుంటుంది. అదే ఏదైనా తేడా కొట్టిందా.. ఇక అంతే సంగ‌తులు ట్రోలర్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాను రెగ్యుల‌ర్‌గా ఫాలో అయ్యే వారికి అదెందుకనే సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న క్రేజీ మూవీస్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న వీర‌సింహా రెడ్డి ఒక‌టి. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.
రానున్న సంక్రాంతి పండుగ‌కి వీర సింహా రెడ్డి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది. సినిమా యూనిట్ ప్ర‌మోష‌నల్ యాక్టివిటీస్‌పై శ్ర‌ద్ధ పెట్టింది. అందులో బాగంగా తాజాగా ఓ పాట‌ను రిలీజ్ చేశారు. జై బాల‌య్య అంటూ సాగే ఈ పాట‌కు త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. పాట‌ను త‌మ‌న్ నెక్ట్స్ రేంజ్‌లో అందిస్తాడ‌ని నంద‌మూరి ఫ్యాన్స్ స‌హా సినీ అభిమానులంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. అయితే జై బాల‌య్య‌.. అంటూ రిలీజైన సాంగ్ నిరాశ ప‌రిచింది. ట్యూన్ బాగో లేక‌పోతే పోయింది. కానీ.. విజ‌య‌శాంతి టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఒసేయ్‌..రాములమ్మ సినిమాలో టైటిల్ సాంగ్‌లా ఉందంటూ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
ఇంకేముంది మీమ‌ర్స్‌కి, ట్రోల‌ర్స్‌కి బ్ర‌హ్మానందం వీడియోలు ఎలాగూ ఉన్నాయి కాబ‌ట్టి వాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చి పోతున్నారు. జై బాల‌య్య సాంగ్‌లో త‌మ‌న్ కూడా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. త‌న వెరైటీ డ్రెస్ వేసుకుని క‌నిపించాడు. దీనిపై కూడా నెటిజ‌న్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. నీకు డ్రెస్సింగ్ మీద ఉన్న శ్ర‌ద్ధ ట్యూన్ మీద లేదు అంటూ కామెంట్స్ విసురుతున్నారు. అఖండ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చిన త‌మ‌న్.. వీర సింహా రెడ్డిపై నెగిటివ్ ఇంప్రెష‌న్ సంపాదించుకున్నాడు. మ‌రి దాన్నెల క‌వ‌ర్ చేసుకుంటాడో చూడాలిక.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. కన్నడ నటుడు దునియా విజయ్ కీ రోల్ చేశారు. https://twitter.com/i/status/1596041571778322432

Untitled Document
Advertisements