సోయాతో దోశెలు మీకోసం..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 01:48 PM

సోయాతో దోశెలు మీకోసం..

సోయా చర్మానికి చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు సోయాబీన్స్ తరుచూ తీసుకోవాలి. వివిధ విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రొటీన్లను కలిగిఉండడం వల్ల సోయాబీ‌న్స్ అత్యంత పోషకమైనది. అవి మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గించేందుకు మరియు గుండె ఆరోగ్య నిర్వహణకు సహాయంచేస్తాయి. నిద్ర రుగ్మతలు నిరోధించేందుకు మరియు జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు కూడా సోయాబీ‌న్స్‌ను ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం సోయతో ఓ కొత్త వంటకాని చుసేదం అదేంటే సోయా
దోశెలు.. ఎలా చెయ్యాలో చుడండి..
కావాల్సినపదార్ధాలు : సోయాగింజలు - ఒక కప్పు, బియ్యం - మూడు టీస్పూనులు, మిపప్పప్పు - రెండు టీ స్పూనులు, పెరుగు (పుల్లనిది) - పావు కప్పు, జీలకర్ర - ఒకటిన్న స్పూను, నూనె - తగినంత, ఉప్పు - సరిపడినంత, పచ్చి మిర్చి తరుగు - రెండు స్పూనులు, ఉల్లి తరుగు - పావు కప్పు, క్యారెట్ తురుము - మూడు టీస్పూనులు
తయారి విధానం : సోయాగింజల్ని గంట ముందే నీళ్లలో నానబెట్టేసుకోవాలి. అలాగే బియ్యం, మినపప్పు కూడా వేరేగా నానబెట్టాలి. అవి బాగా నానాక... మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బులో ఉప్పు, జీలకర్ర, పెరుగు వేసి బాగా కలపాలి. దోశెలు వేసుకోవడానికి సరిపడా పదును కోసం అవసరమైతే నీళ్లు వేసుకోవచ్చు. వేడెక్కిన పెనంపై దోశెను వేసుకోవాలి. దోశెపైనా పచ్చి మిర్చి తరుము, ఉల్లి తురుము, క్యారెట్ తురుము చల్లాలి. ఎర్రగా కాలాక ప్లేటులో వేసుకుని స్పైసీ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.





Untitled Document
Advertisements