గతంలో అప్పు చేసి సోదరి వివాహం చేసిన వ్యక్తి ఇప్పుడు నూతన వధువుకు 100 కానుకలు..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 01:54 PM

గతంలో అప్పు చేసి సోదరి వివాహం చేసిన వ్యక్తి ఇప్పుడు నూతన వధువుకు 100 కానుకలు..

వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత సంతరించుకున్న వ్యవస్థ. మరియు ఒక ఆడపిల్ల వివాహం చెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాగా కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లిళ్లు జరిపించడానికి నానా తంటాలు పడుతుంటారు. మరికొందరు ఈడోచ్చిన కూతురుకి పెళ్లి సంబంధం చూసి వివాహం జరిపించాలని ఆశపడుతుంటారు. కానీ కొందరి ఆర్థిక పరిస్థితి బాగాలేక సరిగ్గా పెళ్లి జరిపించలేక మానసిక వేదనకు గురౌతుంటారు. మరికొందరు అప్పు చేసీ మరీ తమ గారాల పట్టీకి గ్రాండ్ గా పెళ్లి జరిపిస్తుంటారు. అయితే.. ఇలాంటి వారికి ఆదుకునేందుకు కొందరు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చారు. వీరు పెళ్లి జరిపించడంతో పాటు.. 100 కు పైగా వస్తువులను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కొందరు గొప్ప మనసు చాటుకున్నారు. స్థానికంగా ముస్తుఫా లక్డావాలో ఉండే బాల్ రాజ్ భాయ్ తన సోదరికి పెళ్లి చేయడానికి అనేక ఇబ్బందులు పడ్డాడు. అప్పుతీసుకుని మరీ పెళ్లి వేడుక జరిపించాడు. అప్పటి నుంచి పెదింటి ఆడబిడ్డలకు ఏమైన చేయాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. దీంతో వీరి మిత్రులతో కలిసి.. బాల్ రాజ్ బాయ్ ఒక గ్రూప్ గా ఏర్పాడ్డారు. అంటే.. 2010 నుంచి ప్రతి ఏడాది పెదింటి ఆడపిల్లల పెళ్లికి వీరు ఆసరాగా నిలుస్తున్నారు. వీరు పెళ్లిళ్లలో బంగారం, వెండి, కిచెన్ సామానులతో పాటు.. 100కు పైగా వస్తువులను కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంతే కాకుండా.. ఏడాదికి 2 సార్లు సాముహిక వివాహలు కూడా జరిపిస్తున్నారు. దానికి అయ్యే ఖర్చంతా వీరే భరిస్తున్నారు. కొన్నిసార్లు.. వీరు అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా.. బాల్ రాజ్ భాయ్ మాట్లాడుతూ.. తాము.. అన్నిదానాల్లో కన్న కన్యాదానం ఎంతో పుణ్యంగా భావిస్తున్నామని, అత్తారింటికి వెళ్తున్న అమ్మాయి ఆనందంతో వెళ్లాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
మొదట్లో వీరు.. సంవత్సరానికి 2, 5, ఆతర్వాత.. 15 మంది పెళ్లిళ్లు జరిపించారు. ఇప్పుటిదాక వీరు 100కి పైగా వివాహలు ముందుండి నిర్వహించారు. ప్రస్తుతం బాల్ రాజ్ బాయ్ స్నేహితులు కలిసి చేసిన మంచి పనిని గ్రామస్థులు, చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. వీరికి కొంత మంది తమవంతుగా సహాయాన్ని కూడా అందిస్తున్నారు. అయితే.. వచ్చే డిసెంబరు 27న వీరు సాముహిక వివాహాలకు ప్లాన్ చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Untitled Document
Advertisements