అదిరిపోయే ఫీచర్ల ఇండియాలో లావా స్మార్ట్‌ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలు..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 02:21 PM

అదిరిపోయే ఫీచర్ల ఇండియాలో లావా స్మార్ట్‌ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలు..

భారతదేశంలో జనానికి వినోదం అందించేంది ఎక్కువగా టీవీనే. పెరుగుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అయితే చాల మంది టీవీలకు సెల్ ఫోన్ లకు అంకితమవుతున్నారు. కాగా ప్రస్తుతం అన్ని డివైజ్‌లు స్మార్ట్‌గా మారుతున్నాయి. టెక్నాలజీ ద్వారా డివైజ్‌లకు మరిన్ని ఫీచర్లను యాడ్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌ వాచ్‌లు, టీవీలు వంటివి మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఇండియన్ టెక్ కంపెనీ లావా, బడ్జెట్ ఫోన్ మార్కెట్లో పాపులర్ బ్రాండ్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సంస్థ మార్కెట్లోకి వరుసగా బడ్జెట్ డివైజ్‌లను లాంచ్ చేస్తోంది. తాజాగా ఇండియాలో లావా బ్లేజ్ ఎన్ ఎక్ష్ టీ అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఇది 4జీబీ + 64జీబీ సింగిల్ కాన్ఫిగరేషన్‌లోనే లభిస్తుంది. మీడియాటెక్ హీలియో జీ37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. పొందుతుంది. లావా బ్లేజ్ మార్క్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో క్లాసీగా కనిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన లావా బ్లేజ్ మోడల్‌కు సక్సెసర్‌గా కంపెనీ కొత్త ఫోన్‌ను రూపొందించింది. మన దేశంలో దీని ధర, లభ్యత, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
కాగా లావా బ్లేజ్ ఎన్ ఎక్ష్ టీ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ37 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను లావా అందించింది. ఈ డివైజ్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీన్ని టైప్-సి పోర్ట్‌ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఇది కేవలం 4జీబీ ర్యామ్ , 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తుంది. వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3జీబీ వరకు విస్తరించుకోవచ్చు. లావా బ్లేజ్ ఎన్ ఎక్ష్ టీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు ఉంటాయి. ఈ కెమెరా సెటప్ 30 ఎఫ్ పీ ఎస్ వద్ద 1080పీ ఫుల్ ఎచ్చ్ డీ వీడియోలను రికార్డ్ చేయగలదు. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది. లావా బ్లేజ్ ఎన్ ఎక్ష్ టీ ఫోన్‌ ధర రూ. 9,299గా ఉంది. ఈ ఫోన్ బ్లూ, రెడ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది కానీ దీని సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే లావా బ్లేజ్ ఎన్ ఎక్ష్ టీ డివైజ్‌ అమెజాన్ లిస్టింగ్‌లో కనిపించింది. అంటే త్వరలో అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements