సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 04:27 PM

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా లో మరో ఇద్దరు హీరోయిన్స్..

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎస్ఎస్ఎమ్బీ 28 వ‌ర్కింగ్ టైటిల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కొన్ని రోజుల ముందే లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వ‌ట‌మే కాకుండా రెండు, మూడు రోజుల షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాల‌నుకునే లోపు.. మ‌హేష్ తండ్రి.. సీనియ‌ర్ హీరో సూప‌ర్‌స్టార్ కృష్ణ క‌న్నుమూశారు. దీంతో ఎస్ఎస్ఎమ్బీ 28 సెకండ్ షెడ్యూల్ డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం కానుంది.
ఎస్ఎస్ఎమ్బీ 28 గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. మ‌హేష్ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్‌గా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు శ్రీలీల న‌టించ‌నుంది. ఆమెతో సంప్ర‌దింపులు కూడా పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. దీంతో పాటు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం కూడా తెలిసింది. అదేంటంటే త్రివిక్మ్ ఎస్ఎస్ఎమ్బీ 28 కోసం ప‌క్కా ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఈ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ మ‌హేష్‌తో కాలు క‌దప‌నుంద‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే ఆమె ఎవ‌ర‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
అంటే ఎస్ఎస్ఎమ్బీ 28 ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. వీళ్లు కాకుండా ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఏదైతేనేం మహేష్ అంటే హ్యండ్ సమ్ హీరో అనే పేరుంది. దానికి మ్యాచ్ అయ్యేలా త్రివిక్రమ్ తన సినిమాలో గ్లామర్ సొబగులను అద్దుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఎస్ఎస్ఎమ్బీ 28 కోసం మహేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ దేహంతో కనిపించబోతున్నారనేది సమాచారం. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మూవీని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్పారు. కానీ సినీ సర్కిల్ న్యూస్ మేరకు.. ఆగస్ట్ 9 లేదా 10వ తేదీల్లో ఎస్ఎస్ఎమ్బీ 28 రిలీజ్ అవుతుంది.

Untitled Document
Advertisements