రిచా చద్దాకి మద్దతుగా నిలిచినసీనియర్ యాక్టర్.. ప్రకాశ్ రాజ్..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 04:49 PM

రిచా చద్దాకి మద్దతుగా నిలిచినసీనియర్ యాక్టర్..  ప్రకాశ్ రాజ్..

బాలీవుడ్ నటి రిచా చద్దాకి అనూహ్యరీతిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలిచాడు. ఆమె రెండు రోజుల క్రితం గల్వాన్‌ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దాంతో వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేసిన రిచా చద్దా.. వివరణ కూడా ఇచ్చింది. కానీ.. ఇప్పటికే ఆమెపై పలు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అలానే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సెలెబ్రిటీలు ఆమెని విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఇండియా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల ఓ ట్వీట్ చేశారు. ‘‘పాక్ ఆక్రమించిన కాశ్మీర్‌ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఓకే చెప్తే.. ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలో పాకిస్థాన్ కాల్పులకి దిగితే మా సమాధానం వేరేలా ఉంటుంది. గవర్నమెంట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం ’’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌కి ‘గల్వాన్ సేస్ హాయ్’అంటూ రిచా చద్దా రిప్లై ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ గురువారం రాత్రి జూహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలానే అక్షయ్ కుమార్ ఆ ట్వీట్ తనని బాధించి అని చెప్తూ.. సైనికుల్ని అలా తక్కువ చేయకూడదని మొట్టికాయలు వేస్తూ.. వాళ్లు అక్కడ ఉండబట్టే మనం సేఫ్‌గా ఉంటున్నాం అని ఆమెకి హితవు పలికాడు. అలానే టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఆమెకి ఏమైంది.. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల్ని పూజించాలి. ఇలాంటి వారిని చూస్తే బాధేస్తుంది అని మండిపడ్డాడు. అలానే హీరో నిఖిల్ కూడా రిచా చద్దా తీరుని తప్పుబట్టాడు. కానీ.. అనూహ్యరీతిలో రిచా చద్దాకి ప్రకాశ్ రాజ్ నుంచి మద్దతు లభించింది. రిచా చద్దాని ఉద్దేశిస్తూ అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ ‘‘ఇలాంటి ట్వీట్‌ని అక్షయ్ కుమార్ నుంచి ఊహించలేదు. మీ కంటే ఎక్కువగా రిచా చద్దాకి ఈ దేశంతో అనుబంధం ఉంది సార్. ఊరికే అడుగుతున్నా’’ అంటూ కౌంటరిచ్చాడు. రిచా చద్దా గురువారం ‘గల్వాన్ సేస్ హాయ్’ ట్వీట్‌కి వివరణ ఇచ్చే క్రమంలో తన సోదరుడు ఆర్మీలోనే పనిచేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలానే తన అంకుల్ ఆర్మీలో పారాట్రూపర్ అని.. గతంలో జరిగిన ఇండో- చైనా యుద్ధంలోనూ తన బంధువు ఒకరు దేశం కోసం ఫైట్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements