ఒకేలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టడం చాల కష్టం .. సామ్..

     Written by : smtv Desk | Mon, Jan 09, 2023, 10:56 AM

ఒకేలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టడం చాల కష్టం .. సామ్..

గత ఏడాది 'యశోద' మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించింది. ఆ మూవీ డబ్బింగ్‌ వర్క్‌ని కూడా సెలైన్ సాయంతో పూర్తి చేస్తున్న ఫొటోని సమంత షేర్ చేసింది. ఆ తర్వాత యశోద మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉండిపోయిన సమంత.. సక్సెస్ మీట్‌కి కూడా హాజరుకాలేదు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న సామ్ తాజాగా ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. ప్రస్తుతం 'శాకుంతలం' సినిమా డబ్బింగ్‌ పనుల్లో సమంత ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తాజాగా శాకుంతలం సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. షూటింగ్ సమయంలో తనకు కష్టంగా అనిపించిన విషయం గురించి సామ్ చెప్పుకొచ్చింది.
"శాకుంతలం సినిమాలో నటించేటప్పుడు నా పాత్ర స్వభావానికి తగ్గట్టు ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ ఒకేలా పెట్టడం, ఒకే భంగిమలో ఉండడం కష్టంగా అనిపించింది. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు ఆఖరికి ఏడుస్తున్నప్పుడు కూడా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ ఒకేలా పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ భంగిమనే కొనసాగించాల్సి వచ్చింది. అలా ఒకే స్టైల్‌ను కొనసాగించడం నా వల్ల కాలేదు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను."
ఇలా శాకుంతలం భంగిమలో ఉన్న తన ఫొటోను సామ్ షేర్‌ చేసింది. దీనితో పాటు దీనంగా చూస్తున్న తన పెంపుడు కుక్క వీడియోను కూడా పోస్ట్‌ చేసింది.
గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు విజయ్‌ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.
https://www.instagram.com/p/CnJGB3SBViu/?utm_source=ig_embedutm_campaign=embed_video_watch_again





Untitled Document
Advertisements