ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి క్లారిటీ.. జక్కన్న

     Written by : smtv Desk | Tue, Jan 10, 2023, 12:49 PM

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి క్లారిటీ.. జక్కన్న

గత ఏడాది మార్చ్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.. ఈ సినిమాలో రాం చరణ్, ఎన్టీఆర్ కీలిక పాత్రా పోషించగా.. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అలాగే ఈ సినిమా ఎన్నో అవార్డు లను సొంతం చేసుకోగా.. ఆస్కార్ నామినేషన్స్‌కు భారత్ నుంచి అఫిషియల్ ఎంట్రీగా చాన్స్ దక్కలేదు. అయినప్పటికీ ఇండిపెండెంట్ నామినేషన్స్‌లో పోటీపడుతోంది. మరోవైపు బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌గా ‘నాటు నాటు’ సాంగ్‌తో పాటు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నామినేషన్స్‌ షార్ట్ లిస్టులో ఉన్నాయి. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్‌గా పొందిన క్రేజ్ దృష్ట్యా అభిమానులు ఈ మూవీ సీక్వెల్ కోసం రాజమౌళిని అడుగుతున్నారు. గతంలో అలాంటి ఆలోచన లేదని తిరస్కరించిన జక్కన్న.. రీసెంట్ ఇంటరాక్షన్‌లో మాత్రం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అదే పనిలో ఉన్నాడని ప్రకటించాడు.
మరోవైపు రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్‌తో కమిట్ అయ్యాడు. #ఎస్ఎస్ఎంబీ29గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను అడ్వెంచరస్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు ఇదివరకే వెల్లడించాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ‘ఆర్‌ఆర్ఆర్’ సీక్వెల్ గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే రాజమౌళి తాజాగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘నా దగ్గర లాక్ చేయబడిన స్క్రిప్ట్ ఉంది, కానీ దాని గురించి ఇప్పుడే చెప్పలేను’ అన్నాడు. దీంతో ఆయన స్టేట్‌మెంట్‌పై నెట్టింట చర్చ మొదలైంది.
దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్‌‌ఆర్2’ గురించే ఇలా మాట్లాడారని, సీక్వెల్ స్క్రిప్ట్‌ గురించి జాగ్రత్తగా హింట్ ఇచ్చారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొందరు మాత్రం మహేష్‌తో చేయబోతున్న #ఎస్ఎస్ఎంబీ29 గురించి కూడా అయ్యుండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరంచేంత వరకు నిర్ధారణకు రాలేమని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లాస్ ఏంజిల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ అనంతరం జరిగిన చాట్ సెషన్‌లో తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా కొమురం భీముడో సాంగ్ గురించి వివరిస్తూ.. తన కనుబొమ్మపై కెమెరా ఫ్రేమ్ చేసినా నటించి చూపగలడని కొనియాడాడు.
మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఆస్కార్ రేసులో నిలిపేందుకు తారక్‌తో కలిసి రాజమౌళి బాగానే కష్టపడుతున్నారు. కాగా ఈ ప్రమోషన్ ఈవెంట్స్ ముగిసిన తర్వాత జక్కన్న.. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఎస్ఎస్ఎంబీ29పై కాన్సంట్రేట్ చేయనున్నాడు. ఇక జూనియర్ విషయానికొస్తే.. కొరటాల శివతో #ఎన్టీఆర్30 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో #ఎన్టీఆర్31 పట్టాలెక్కించనున్నాడు.





Untitled Document
Advertisements