ఉత్కంఠను రేపుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజా చిత్రం వీడియో..

     Written by : smtv Desk | Tue, Jan 10, 2023, 01:32 PM

ఉత్కంఠను రేపుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజా చిత్రం వీడియో..

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ అమ్మది పేరు తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఫ్యాన్స్ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ప్రతినాయిక పాత్రల్లో తన సత్తా చాటుతుంది. అంతేకాక సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూనే నాయిక ప్రధాన పాత్రల్లో సైతం దుసుకేలుతూ సినిమా భారాన్ని మొత్తం మోస్తుంది ఈ అమ్మడు. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శబరి' రెడీ అవుతోంది.
ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో ఒక వీడియోను వదిలారు. ఒక ఫారెస్టు ఏరియాలో తన పాపను పెట్టుకుని 'శబరి' ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక ఒక ఆగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.
అతని బారి నుంచి ఆమె తన కూతురిని ఎలా కాపాడుకుంది? ఇంతకీ అతను ఎవరు? అనే సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
https://youtu.be/og3MxI4Coac





Untitled Document
Advertisements