జనవరి 12 నుంచి అమెజాన్ లో అమ్మకాని సిద్దంగా ఉన్న ఐకూ 11

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 02:13 PM

జనవరి 12 నుంచి అమెజాన్ లో అమ్మకాని సిద్దంగా ఉన్న ఐకూ 11

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఒకపక్క తక్కువ ధరకు ఫోన్ లు అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ధర ఎక్కువైనా పర్వాలేదు ఫీచర్స్ లో రాజీ అక్కర్లేదు అనుకునే కస్టమర్స్ కొరకు అన్ని ఫీచర్స్ మరియు అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. వీటికోసం రూ.25వేలకు పైనే వెచ్చించేలా మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఇలాంటి అన్ని రకాల ఫీచర్లతో వచ్చిందే ఐకూ 11 . 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. 16జీబీ వేరియంట్ ధర రూ.64,999.

ఈ ఫోన్ అమ్మకాలు జనవరి 12 నుంచి అమెజాన్ లో ఆరంభమవుతాయి. ప్రైమ్ యూజర్లు అదే రోజు కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు 13 నుంచి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రెండు రకాల షేడ్స్ లో ఈ ఫోన్ విడుదలైంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్5 లెన్స్, అలాగే 13 మెగాపిక్సల్ టెలీఫొటో లెన్స్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు వీలుగా సొంతంగా అభివృద్ధి చేసిన వీ2 ఇమేజింగ్ చిప్ ను అమర్చారు. బ్యాంకు కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.





Untitled Document
Advertisements