ఈ జ్యూస్ తో మధుమేహ సమస్యలకు చెక్!

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 03:51 PM

ఈ జ్యూస్ తో మధుమేహ సమస్యలకు చెక్!

మధుమేహంతో బాధపడేవారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు దానిని అదుపులో ఉంచుకోవడానికి. అయితే కొత్తి మీర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు.. కొత్తిమీరలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బాడీకి కావాల్సిన A, B, C E, B6 విటమిన్లు తగినంత మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో బాగంగా తీసుకుంటే శరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి.దీంతో పాటు అధిక బరువుతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నిమత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఈ డ్రింక్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీర రసానికి తయారీకి కావలసిన పదార్థాలు :
*కొత్తిమీర కట్ట - ఒకటి
*తాజా పెరుగు - ఒక గిన్నెడు
*దాల్చిన చెక్క పొడి - 1-2 గ్రాములు
*తేనె - రుచికి తగినంత

కొత్తిమీర రసాన్ని తాయారు చేసుకోవాల్సిన విదానం : కొత్తిమీర రసాన్ని తయారు చేయడం చాలా సులభం. అయితే దీని కోసం ముందుగా కొత్తిమీర కట్ట మిక్సీలో వేసి గ్రైడ్‌ చేయాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని అందులో తాజా పెరుగును వేయాలి. ఇలా వేసిన వాటిని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకుని మిక్స్‌ చేసుకోవాలి . ఆ తర్వాత దీనిని ఖాళీ కడుపుతో తీసుకునే క్రమంలో తేనెను వేసి కలుపుకుని తాగాలి.శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.








Untitled Document
Advertisements