కోడి గుడ్డులో లాభాలే కాదు నష్టాలూ కూడా ఉన్నాయి..

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 04:50 PM

కోడి గుడ్డులో లాభాలే కాదు నష్టాలూ కూడా ఉన్నాయి..

పోషకాహారం చెప్పగానే మనకు మొదట గుర్తొచ్చేవి కోడిగుడ్లు. గుడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్ గా పేర్కొనబడింది. గుడ్డుని పిల్లల నుండి పెద్దల వరకు దాదాపు అందరు ఇష్టంగా తింటారు. కోడి గుడ్డు ఆరోగ్యానికి చాల శ్రేయస్కరం.
గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీన్నిమన జుట్టుకి పెట్టుకుంటే జుట్టు మృదువుగా ఉంటుంది మరియు చుండ్రు పోతుంది.
కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెప్తూ ఉంటారు.. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు నిపుణులు. ఇందులో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్ మరియు ఇతర పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కోడిగుడ్డులో గుడ్లలో ఆరు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జుట్టుకి, గోళ్ళకి ఇది చాలా మేలు చేస్తాయి. అలాగే విటమిన్-డి కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే క్రమం తప్పకుండా గుడ్లను తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉంటాయి. రోజు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. అయితే కోడిగుడ్డు వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయట. ఎక్కువ గుడ్లను రోజూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
కోడి గుడ్డు వల్ల నష్టాలూ :
డయాబెటిస్ ఉన్నవాళ్ళు గుడ్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ గుడ్లు తీసుకునే వారిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గినట్లు తెలుస్తోంది.కొన్ని ప్రఖ్యాత హెల్త్ అండ్ హాస్పిటల్ సర్వే ల ప్రకారం కోడిగుడ్డు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అలానే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయట. పలు రీసర్చ్ ల ప్రకారం పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ ను తీసుకోవడం వల్ల మన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగదట. గుడ్డు లో 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది అయితే ఇలా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అందువల్ల గుడ్లను తీసుకునేటప్పుడు వాటిని ఉడకబెట్టి కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.





Untitled Document
Advertisements