గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎరుపెక్కుతాయి ఎలా?

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 11:46 AM

 గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎరుపెక్కుతాయి ఎలా?

ప్రతి ఒక్క అమ్మాయికి గోరింటాకు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం అయిన ముందుగా మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు.. పుట్టినరోజు, పండుగలు, పెళ్లిలు, వంటి సందర్భాలలో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు అని పెద్దవాళ్ళు అంటారు.. కానీ గోరింటాకు పెట్టుకుంటే ఎందుకు ఎర్రగా పండుతుంది ఎవరికైనా తెలుసా.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరంపై చర్మం నాలుగు పొరలుగా నిర్మాణమై ఉంటుంది. అన్నిటికన్నా పైన ఉండే పొరను స్త్రేటమ్ కార్నియం అన్ని, దాని కింద ఉండే పొరలను వరుసగా ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్ క్యుటేనియస్ అని పిలుస్తారు. చేతిపై గోరింటాకు పెట్టగానే దానిలో నీటితో కూడిన ఎర్రని రంగు శరీరం పైన ఉండే మొదటిపోర రంధ్రాల్లో నుంచి చర్మం లోపలికి ప్రవేశించి రెండో పొర దగ్గర ఆగి పోతుంది. గోరింటాకు ఎండిపోగానే ఎర్ర రంగుతోపాటు ఉండే నీరు శరీరంలోని ఉష్ణోగ్రత వల్ల అవీరైపోతుంది. రంగు మాత్రం అలా ఉండిపోతుంది. దీంతో గోరింటాకు తీసివేసిన తర్వాత కూడా ఎర్రని రంగు కనిపిస్తుంది. వేలిగోళ్ల విషయానికి వస్తే ఎర్రరంగు గోళ్లలోని పొరల మద్య చిక్కుకుపోవడంవల్ల గోళ్లు కూడా ఎర్రబడతాయి.గోళ్లకన్నా చేతి చర్మంలోని రంధ్రాలు విశాలంగా ఉండటంతో చర్మంపై ఏర్పడిన రంగు గోళ్లపై ఏర్పడిన రంగుకన్నా తొందరగా పోతుంది.






Untitled Document
Advertisements